Lots of Love: తండ్రికి కొత్త ఉద్యోగం.. ఎగిరి గంతేసిన కూతురు, వీడియో వైరల్!

తండ్రీకూతుళ్ల బంధం మాటల్లో చెప్పలేం. వర్ణించడం కూడా సాధ్యంకాదు. తండ్రీకూతురి మధ్య బంధానికి సంబంధించిన

  • Written By:
  • Publish Date - October 17, 2022 / 03:30 PM IST

తండ్రీకూతుళ్ల బంధం మాటల్లో చెప్పలేం. వర్ణించడం కూడా సాధ్యంకాదు. తండ్రీకూతురి మధ్య బంధానికి సంబంధించిన ఓ వీడియో చక్కర్లు కొడుతోంది. తండ్రిపై కూతురి ప్రేమ ఎలా ఉంటుందో తెలియజేస్తోంది. ఎలాంటి ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న ఓ తండ్రికి స్విగ్గీ కంపెనీలో ఉద్యోగం వస్తుంది. స్విగ్గీ చొక్కాతో ఇంటికి వచ్చిన తండ్రిని చూసి ఎగిరి గంతేస్తుంది కూతురు. అంతేకాదు.. తండ్రి గట్టిగా హగ్ చేసుకొని ఆనందం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సో స్వీట్.. లాట్స్ ఆఫ్ లవ్ అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.  మీరు కూడా ఈ వీడియోను చూస్తే కచ్చితంగా ఆ అమ్మాయి ప్రేమకు ఫిదా అవుతారు.