Site icon HashtagU Telugu

LG ఎలక్ట్రానిక్స్ ఇండియా లిమిటెడ్ “లైఫ్ ఈజ్ గుడ్ సర్వే”

LG Electronics India Limited "Life is Good Survey"

LG Electronics India Limited "Life is Good Survey"

LG: ప్రపంచ ఆనంద దినోత్సవం సందర్భంగా  NielsenIQ భాగస్వామంతో LG ఎలక్ట్రానిక్స్ ఇండియా లిమిటెడ్ ఈ రోజు ఒక కొత్త నివేదికను వెల్లడించింది. పట్టణ భారతీయులను ఏది ఆనందంగా మరియు ఆశావాహకంగా ఉంచుతోంది అని ‘ లైఫ్ ఈజ్ గుడ్ సర్వే‘ శీర్షిక గల నివేదిక తెలియచేసింది. భారతదేశంలో ఎనిమిది ప్రధానమైన పట్టణాలలో 1313 మంది పై ఈ అధ్యయనం జరిగింది. ఇది వ్యక్తిగత సంబంధాలు, విజయాలు మరియు ఆనందాల మధ్య శక్తివంతమైన సహ సంబంధం ఉందని వెల్లడించింది.

అధ్యయనంలో కనుగొన్న కీలకమైన అంశాలు:

కుటుంబం ప్రధమం. స్నేహితులు మరియ కుటుంబంతో గడిపిన నాణ్యమైన కాలంతో ‘లైఫ్ ఈజ్ గుడ్’ క్షణాలను 54% పట్టణ భారతీయులు సంబంధాన్ని కలిగి ఉండగా, 45% మంది ప్రత్యేకంగా ‘లైఫ్ ఈజ్ గుడ్’ విషయంతో కుటుంబ బంధంతో అనుసంధానం చేసారు. కేరీర్ మరియు వ్యక్తిగత అభివృద్ధి..వృత్తిపరమైన విజయానికి ఈ అధ్యయనం శక్తివంతమైన ప్రాధాన్యతనిచ్చింది. కెరీర్ లో విజయం సాధించడం మరియు గుర్తింపుతో ఒక మంచి జీవితంతో 49% మంది సంబంధం కలిగి ఉన్నారు. ఉద్యోగాలు చేసే ప్రొఫెషనల్స్ లో, పని-జీవితం సమతుల్యతను సాధించడంలో 64% మంది ఆనందాన్ని కనుగొన్నారు. ఆరోగ్యం మరియు సంక్షేమం: మంచి ఆరోగ్యం మరియు సంక్షేమాలు ఆనందాన్ని కలిగించడంలో కీలకమైన అంశాలుగా 54% మంది జవాబు ఇచ్చారు. పట్టణ భారతీయులలో ఆరోగ్యం పై పెరుగుతున్న ప్రాధాన్యతను ఇది సూచిస్తోంది. సాధారణ అభిప్రాయాలు: ఈ అధ్యయనం Gen Z ప్రాధాన్యతల అభిప్రాయాలను తెలియచేస్తోంది, 39% మంది విద్యార్థులు (18-24) డిజిటల్ కార్యకలాపాల్లో పాల్గొనడంలో మరియు సామాజిక మీడియా కనక్టివిటీలో ఆనందాన్ని కనుగొన్నారు.

Read Also: Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్‌ కేసు.. శ్రవణ్‌కు సుప్రీంకోర్టులో ఊరట

ఆధునిక సవాళ్లు:

పనికి సంబంధించిన ఒత్తిడి ప్రధానమైన అంశంగా తమ ఆనందం పై వ్యతిరేక ప్రభావం చూపిస్తోందని 40% మంది పేర్కొన్నారు. అయితే, గత అయిదేళ్లుగా పని-జీవితం సమతుల్యత మెరుగుపడిందని 24% వర్కింగ్ ప్రొఫెషనల్స్ తెలియచేసారు, ఇది అనుకూలమైన పని ప్రదేశం అభివృద్ధిని సూచిస్తోంది.

ఆశావాదానికి మార్గం:

వ్యక్తిగత లక్ష్యాలను ఏర్పరుచుకోవడం మరియు సాధించడంతో 38% మంది ఆశావాదాన్ని అనుసంధానం చేసారు. జీవితంలో ఆశావాదంగా ఉండటానికి మైండ్ ఫుల్నెస్ & ధ్యానం సాధన చేయడాన్ని 36%మంది అనుసంధానం చేసారు. 51% మంది శక్తివంతమైన సంబంధాలు మరియు కుటుంబ బంధాలు ద్వారా సంతృప్తికరమైన జీవితాన్ని నిర్వచించారు.‘లైఫ్ ఈజ్ గుడ్’ పరిశోధనా అధ్యయనాన్ని సమర్పించడానికి LG ఎలక్ట్రానిక్స్ గర్విస్తోంది. ఈ కార్యక్రమం మా వినియోగదారులను అర్థం చేసుకోవడానికి మా యొక్క నిబద్ధతను సూచిస్తోంది. లైఫ్ ఈజ్ గుడ్ అధ్యయనం కనుగొన్న విషయాలు అనేవి ఆరోగ్యవంతమైన జీవితానికి తోడ్పాటును అందించే అంశాల్లోకి విలువైన అభిప్రాయాలను కేటాయిస్తుంది. మా వినియోగదారుల కోసం అర్థవంతమైన అనుభవాలను అందచేయడాన్ని కొనసాగించడానికి ఈ అభిప్రాయాలు మాకు ఒక ప్రణాళికగా పని చేస్తాయి” అని హాంగ్ జు జియాన్, మేనేజింగ్ డైరెక్టర్ LG ఎలక్ట్రానిక్స్ ఇండియా లిమిటెడ్ అన్నారు. ఢిల్లీ, ముంబయి, చెన్నై, కొల్ కత్తా, కొచ్చీ, కోయంబత్తూరు, ఛంఢీఘర్, సూరత్, పాట్నాలలో “లైఫ్ ఈజ్ గుడ్ స్టడీ” నిర్వహించబడింది. పని చేసే ప్రొఫెషనల్స్, విద్యార్థులు, ఔత్సాహికులు మరియు గృహిణులు సహా వివిధ జన సమూహాలలో ఈ అధ్యయనం జరిగింది.

Read Also: CM Chandrababu : వేసవి ప్రణాళికపై సీఎం చంద్రబాబు సమీక్ష..

Exit mobile version