Kavitha : అక్రమ అరెస్టుపై న్యాయ పోరాటం చేస్తా: కవిత

  MLC Kavitha : తనపై తప్పుడు కేసు పెట్టారని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. ఈడీ(ED) తనను చట్టవిరుద్ధంగా అరెస్టు చేసిందని చెప్పారు. అక్రమ అరెస్టుపై( illegal arrest) న్యాయ పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. లిక్కరు కేసు ఒక కట్టుకథ అన్నారు. భారీ భద్రత నమడుమ ఈడీ అధికారులు ఎమ్మెల్సీ కవితను ఢిల్లీ(Delhi)లోని రౌస్‌ అవెన్యూ కోర్టు(Rouse Avenue Court)లో హాజరు పరిచారు. ఈ సందర్భంగా కోర్టు ప్రాంగణంలో ఆమె మీడియాతో అన్నారు. […]

Published By: HashtagU Telugu Desk
Legal Fight Against Illegal

Legal Fight Against Illegal

 

MLC Kavitha : తనపై తప్పుడు కేసు పెట్టారని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. ఈడీ(ED) తనను చట్టవిరుద్ధంగా అరెస్టు చేసిందని చెప్పారు. అక్రమ అరెస్టుపై( illegal arrest) న్యాయ పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. లిక్కరు కేసు ఒక కట్టుకథ అన్నారు. భారీ భద్రత నమడుమ ఈడీ అధికారులు ఎమ్మెల్సీ కవితను ఢిల్లీ(Delhi)లోని రౌస్‌ అవెన్యూ కోర్టు(Rouse Avenue Court)లో హాజరు పరిచారు. ఈ సందర్భంగా కోర్టు ప్రాంగణంలో ఆమె మీడియాతో అన్నారు.

మరోవైపు కవిత తరపున సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి, మోహిత్‌ రావు వాదనలు వినిపించనుండగా.. ఈడీ తరపున స్పెషల్ పీపీ ఎస్‌కే మట్టా, ఈడీ స్పెషల్ కౌన్సిల్ జోయబ్ హుస్సేన్ వాదనలు వినిపించనున్నారు. ఇక కవితకు మద్దతుగా బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవి చంద్ర, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ కోర్టు కు వచ్చారు.

లిక్కర్ స్కామ్ లో సౌత్ గ్రూప్ లో కవితను ప్రధాన వ్యక్తిగా ఈడీ పేర్కొంది. ఆమెను మరింతగా విచారించేందుకు కస్టడీకి అప్పగించాలని కోర్టును కోరింది. రిమాండ్ రిపోర్టును కూడా కోర్టుకు సమర్పించింది. ఈ నేపథ్యంలో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై టెన్షన్ నెలకొంది. కవితకు జైలా? బెయిలా? అనేది కాసేపట్లో తేలిపోనుంది.

We’re now on WhatsApp. Click to Join.

కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కవితను ఈడీ నిన్న అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. బంజారాహిల్స్ లోని ఆమె నివాసంలో ఆమెను అదుపులోకి తీసుకున్న ఈడీ అధికారులు… ఆమెను నేరుగా ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి తరలించారు. నిన్న రాత్రి ఒకసారి, ఈ ఉదయం మరోసారి ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. కాసేపటి క్రితం ఆమెను ఢిల్లీలోని రౌస్ అరెన్యూ కోర్టులో ఈడీ అధికారులు ప్రవేశ పెట్టారు. కవితను కస్టోడియల్ ఇంటరాగేషన్ కు ఈడీ అధికారులు కోరుతున్నారు. కవితపై మనీ లాండరింగ్ సెక్షన్ల కింద ఈడీ అభియోగాలు మోపింది. కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందనే విషయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

 

 

 

 

 

  Last Updated: 16 Mar 2024, 12:47 PM IST