Cellphone – Sperm Count : స్పెర్మ్ కౌంట్‌కు సెల్‌ఫోన్ దెబ్బ.. వేడెక్కుతున్న వృషణాలు

Cellphone - Sperm Count : స్విట్జర్లాండ్‌లోని జెనీవా యూనివర్సిటీ సైంటిస్టుల తాజా పరిశోధనలో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి.

  • Written By:
  • Updated On - November 5, 2023 / 08:18 AM IST

Cellphone – Sperm Count : స్విట్జర్లాండ్‌లోని జెనీవా యూనివర్సిటీ సైంటిస్టుల తాజా పరిశోధనలో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. రోజుకు 20 కంటే ఎక్కువసార్లు ఫోన్‌ను ఉపయోగించే పురుషులలో స్పెర్మ్ కౌంట్ బాగా తగ్గిపోతోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. మొబైల్ ఫోన్లు విడుదల చేసే మైక్రోవేవ్స్ అందుకు కారణమని వెల్లడించారు. మొబైల్ ఫోన్ల నుంచి విడుదలయ్యే మైక్రోవేవ్స్ ప్రభావంతో వృషణాల టెంపరేచర్ లెవల్స్ పెరిగిపోయి..  స్పెర్మ్ ఉత్పత్తి కోసం  వృషణాల లోపల రిలీజ్ కావాల్సిన హార్మోన్లు తగ్గిపోతున్నాయనే సందేహం  తమకు కలుగుతోందని జేనీవా యూనివర్సిటీ సైంటిస్టులు చెప్పారు. పురుషుల వీర్యంలోని స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతే.. సంతాన సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయని చెప్పారు.

We’re now on WhatsApp. Click to Join.

తాము అధ్యయనంలో భాగంగా 2005 నుంచి 2018 సంవత్సరాల మధ్య 18 నుంచి 22 ఏళ్ల లోపు వయస్సు గల 2,886 మంది యువకులపై పరిశోధనలు చేశామని జెనీవా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ సెర్జ్ నెఫ్ వెల్లడించారు. రాబోయే ఐదేళ్లలో కూడా వారి నుంచి శాంపిల్స్‌ను సేకరిస్తే.. మరిన్ని ఆధారాలు లభించే అవకాశం ఉంటుందని తెలిపారు. గత 50 ఏళ్ల లెక్కలనే తీసుకుంటే.. ప్రపంచవ్యాప్తంగా పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ 50 శాతం డౌన్ అయిందని స్టడీ రిపోర్ట్స్ చెబుతున్నాయి. సాధారణంగా పురుషులు ఫోన్లను ప్యాంట్ కింది జేబుల్లో పెట్టుకుంటారు. దానివల్ల బ్యాటరీ నుంచి రిలీజయ్యే వేడి, మొబైల్ సిగ్నల్స్ రిలీజ్ చేసే శక్తి మర్మాంగాలకు తగిలే రిస్క్ ఉంటుంది. అందుకే ఫోన్లను ఏదైనా బ్యాగ్‌లో పెట్టుకోవడం మంచిదని నిపుణులు అంటున్నారు. సాధ్యమైనంత మేర ఫోన్ వాడకాన్ని తగ్గించడం బెటర్ అని(Cellphone – Sperm Count) సూచిస్తున్నారు.

Also Read: Gaza Divided : ఇక గాజా రెండు ముక్కలు.. ఇజ్రాయెల్ ఆర్మీ కసరత్తు

గమనిక: ఈ వార్తలోని వివరాలను ఎక్స్ పర్ట్స్ అభిప్రాయం, విశ్లేషణ,  మీడియా నివేదికల ప్రకారం అందించాం. ఇది కేవలం మీ అవగాహన కోసమే. మీ నిర్ణయానికి పూర్తి బాధ్యత మీదే.