Kyra: మగువ కాని మగువ.. ఇన్ స్టాగ్రామ్ లో ఇన్‌ఫ్లుయెన్సర్లలో ఎగువ “కైరా”!!

పేరు కాని పేరుతో సోషల్ మీడియాలో దుమ్ము లేపుతోంది. పుట్టి పట్టుమని 4 నెలలైనా కాకముందే ఇన్ స్టాగ్రామ్ లో లక్ష మందికిపైగా ఫాలోయర్లను సంపాదించుకుంది.

  • Written By:
  • Publish Date - June 12, 2022 / 05:30 PM IST

పేరు కాని పేరుతో సోషల్ మీడియాలో దుమ్ము లేపుతోంది. పుట్టి పట్టుమని 4 నెలలైనా కాకముందే ఇన్ స్టాగ్రామ్ లో లక్ష మందికిపైగా ఫాలోయర్లను సంపాదించుకుంది. అచ్చంగా మగువలను పోలిన ముఖ వర్చసు ఆమె సొంతం. నడక, వస్త్రధారణ కూడా మగువల లాంటిదే. మనం చెప్పుకునే ఈ విశేషణాలన్నీ మనిషివి, మగువవి మాత్రం కావు!! దేశంలోనే తొలి వర్చువల్ ఇన్‌ఫ్లుయెన్సర్ “కైరా” వివరాలు ఇవి!! ఇది సోషల్ మీడియా ఖాతా కలిగి ఉన్న కల్పిత పాత్ర. “కైరా” ఒక ఫోటో రియలిస్టిక్ వర్చువల్ ఇన్‌ఫ్లుయెన్సర్. ఇది టాప్ సోషల్ ఇండియాలో బిజినెస్ హెడ్ హిమాన్షు గోయెల్ యొక్క సృష్టి.
కైరాను డిసెంబర్ 2021లో సాఫ్ట్‌గా లాంచ్ చేసింది. అయితే అధికారికంగా ఆమె పుట్టిన తేదీ 2022 జనవరి 28. కైరా ఖాతాను ఒక ప్రత్యేక కంటెంట్‌ టీమ్ నిర్వహిస్తుంది. కైరా పేరుతో ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేయడమే ఈ టీమ్ పని. కైరా యొక్క ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ఆమెను “భారతదేశం యొక్క మొదటి మెటా-ఇన్‌ఫ్లుయెన్సర్”గా అభివర్ణించింది. కైరాకు వయసు పెరగదు.. వివాదాలకు తావుండదు అని దాని రూపకర్తలు చెబుతున్నారు. ఇండోనేషియా, జపాన్, చైనా దేశాలలో అత్యంత ప్రజాదరణ పొందిన వర్చువల్ ఇన్‌ఫ్లుయెన్సర్‌లు ఇప్పటికే ఉన్నారు. వర్చువల్ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ అంటే కార్టూన్ క్యారెక్టర్స్ మాదిరిగానే ఉంటారు. కానీ అచ్చంగా మనుషుల్ని పోలి ఉంటారు. పోస్టుల్లోని వీడియోలు, చాటింగుల్లో గలగలా మాట్లాడేస్తుంటే.. తెలియని వారు నిజంగా అమ్మాయేనని భ్రమ పడుతుంటారు. ఇటీవలే ఈ నిజాన్ని బయటపెట్టిన రూపకర్తలు.. మాట్లాడడం వరకు సరే కానీ ప్రేమలో పడకండి అని సలహా ఇస్తున్నారు.