Kurian Committee:హైదరాబాద్ గాంధీభవన్‌లో రెండో రోజు కురియన్ కమిటీ భేటీ ముగిసింది. రాష్ట్రానికి చెందిన ఎంపీలు, ఎంపీ అభ్యర్థులు, ఎమ్మెల్యేలు, అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జిలు, డీసీసీ అధ్యక్షులతో భేటీ అయిన కురియన్ కమిటీ సభ్యులు..అప్పటి రాజకీయ పరిణామాలపై ఆరా తీశారు. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగిన కమిటీ భేటీకి నాయకులంతా హాజరై వారి అభిప్రాయాలు తెలియజేశారు. మొదటి రోజు 16 లోక్‌సభ అభ్యర్థుల నుంచి అభిప్రాయాలు తీసుకున్న కమిటీ.. శుక్రవారం అనేక మంది నాయకుల అభిప్రాయాలను సేకరించింది.
We’re now on WhatsApp. Click to Join.
కోదాడ నియోజకవర్గంలో కాంగ్రెస్‌కి ఎక్కు మెజార్టీ వచ్చిందని కమిటీకి చెప్పినట్లు ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి మీడియాకు తెలిపారు. కురియన్ కమిటీని కలిసి భువనగిరి పార్లమెంట్ పరిధిలోని రాజకీయ పరిణామాలపై వివరించినట్లు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి వెల్లడించారు. తన లక్ష్యం ఒకటి నెరవేరిందని, కేసీఆర్‌ను జైలుకు పంపాల్సిన లక్ష్యం నెరవేరాల్సి ఉందని చెప్పారు. బీఆర్‌ఎస్‌లో ఎవరూ ఉండరన్న ఆయన.. హరీశ్‌రావు బీజేపీ లోకి వెళ్తారని జోష్యం చెప్పారు. జగదీశ్ రెడ్డి కాంగ్రెస్‌లోకి వస్తే తీసుకోబోమని స్పష్టం చేశారు. నిజామాబాద్‌లో ఏం జరిగిందో కమిటీకి తెలియజేసినట్లు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ చెప్పారు.
Read Also:Snacks : రుచి విషయంలో రాజీ పడకండి, ఈ 4 దేశీ స్నాక్స్ మీ బరువును అదుపులో ఉంచుతాయి.!
కాగా, ఈరోజు భేటిలో ఎమ్మెల్యేలు, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినా.. ఓడిపోయినా కాంగ్రెస్ అభ్యర్థులతో కమిటీ సమావేశమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్లు.. పార్లమెంట్ నియోజకవర్గంలో వచ్చిన ఓట్లు.. పార్టీ అనుకున్న సీట్లు రాకపోవడంపై నేతల అభిప్రాయం తీసుకోనున్నారు కమిటీ నేతలు. సమావేశానికి రాని నేతలకు ఫోన్ చేసి అభిప్రాయాలు సేకరించారు. ఈనెల 21న ఏఐసీసీకి కురియన్ కమిటి రిపోర్టు ఇవ్వనుంది.
Read Also: Rain Effect: వర్షం, వరద నీరుతో ఈ కంటి వ్యాధి వచ్చే ప్రమాదం ఉంది.. ఇలా రక్షించుకోండి.!