Site icon HashtagU Telugu

KTR : నేడు సాయంత్రం కీలక ప్రకటన చేయనున్న కేటీఆర్‌..!

Ktr

Ktr

ASK KTR: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఈరోజు సాయంత్రం కీలక ప్రకటన చేయనున్నారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై కీలక విషయాలపై చర్చించనున్నారు. ఎక్స్ వేదికగా #AskKTR సెషన్ ద్వారా ఎప్పటికప్పుడు సమకాలీన అంశాలపై తన అభిప్రాయాలను నెటిజన్లతో పంచుకొనే కేటీఆర్.. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు మళ్లీ అందుబాటులోకి రానున్నారు.

అయితే కేటీఆర్‌ రోజుల తర్వాత ఈరోజు సాయంత్రం 6 గంటలకు మరోసారి చిట్ చాట్‌కు సిద్ధమయ్యారు. ఇక కేటీఆర్‌ తో ముచ్చటించాలనుకునే వారు #AskKTR హాష్ ట్యాగ్‌ ఉపయోగించి ఈ సెషన్‌లో పాల్గొనండి అంటూ స్వయంగా కేటీఆర్‌ ప్రకటన చేశారు. అయితే…. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు కేటీఆర్‌ ఎలాంటి అంశాలను తెరపైకి తీసుకువస్తారనే ఆసక్తి రాష్ట్ర రాజకీయాల్లో నెలకొంది. కాగా, గత కొన్ని రోజులుగా కేటీఆర్ పై కాంగ్రెస్, బీజేపీ నేతలు అనేక విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే.

Read Also: Bomb Threats : విమానాలకు వరుస బెదిరింపులు..దర్యాప్తుపై భారత్‌ కీలక నిర్ణయం