KTR Meets Senior BRS Leader Nagam Janardhan Reddy: మాజీ మంత్రి, పార్టీ సినియర్ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. గత కొద్ది రోజులుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చికిత్స అనంతరం కోలుకున్నారు. విషయం తెలుసుకున్న కేటీఆర్ గచ్చిబౌలిలోని నాగం జనార్ధన్ రెడ్డి నివాసానికి చేరుకోని ఆయనను పరామర్శించి, ఆరోగ్యం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
Read Also: Vastu Wisdom: అలా భోజనం చేస్తే ధనలక్ష్మి ఆగ్రహం తప్పదు
కేటీఆర్ వెంట పలువురు పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌తో పాటు సినియర్ పార్టీ నాయకులు రావుల చంద్రశేఖర్ రెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ విప్‌లు బాల్క సుమన్, గువ్వల బాలరాజు, మాజీ ఎమ్మెల్యే లు మర్రి జనార్దన్ రెడ్డి, గణేష్ బిగాల, కోరుగంటి చందర్, ఎమ్మెల్సీ లు నవీన్ కుమార్ రెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్ రావు తదితరులు ఉన్నారు.
కాగా, తొలుత నాగం జనార్దన్ రెడ్డి తెలుగు దేశం పార్టీలో కొనసాగారు. అనంతరం బీజేపీలో చేరి.. మళ్లీ కాంగ్రెస్ లో చేరారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ కేటాయించకపోవడంతో దానం నాగేందర్ కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరారు. ఊహించని విధంగా 2024లో బీఆర్ఎస్ ఓడిపోయింది. కాంగ్రెస్ అనూహ్య ఫలితాలను సాధించింది. ఒకవేళ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే.. మాత్రం నాగం జనార్ధన్ రెడ్డికి మంచి పదవీ దక్కేది. ఇటీవల ఆయన అనారోగ్యానికి గురయ్యారు. గత కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.