KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(ktr) నేడు కరీంనగర్(Karimnagar)పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ కార్యకర్తలతో(Party workers) సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ఎవరు గాడిదో… ఎవరు గుర్రమో… ప్రజలకు కూడా తెలియాలి… అందుకే రేవంత్ రెడ్డి(Revanth Reddy) అయిదేళ్లు పాలన చేయాలి… అప్పుడు రేవంత్ రెడ్డి పాలన చూశాక కేసీఆర్(kcr) గొప్పతనం తెలుస్తుందని అన్నారు. నాడు ఆంధ్రా పాలన మీద 2001లో కేసీఆర్ కరీంనగర్‌లో సింహగర్జన పెట్టారని… ఇప్పుడు అబద్దాల రేవంత్ రెడ్డి పాలన మీద మార్చి 12న మరోసారి కదనబేరి మోగించేందుకు పార్టీ సిద్ధమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
We’re now on WhatsApp. Click to Join.
నిన్న మహబూబ్ నగర్(Mahbub Nagar) సభలో రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఆశ్చర్యాన్ని కలిగించాయన్నారు. జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతున్నానని… కడుపు చింపుతానని… పేగులు మెడలో వేసుకొని తిరుగుతానని… మా ప్రభుత్వాన్ని ఏమైనా చేస్తే మానవ బాంబులా మారుతానని అంటున్నారని.. ఇవేం మాటలు? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఎక్కడైనా జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతారా… జేబు దొంగలే అలా తిరుగుతారని ఎద్దేవా చేశారు. అంతకుముందేమో సచివాలయానికి వచ్చి లంకె బిందెలు దొరుకుతాయని భావించానని అన్నాడని గుర్తు చేశారు. ఈ లంకె బిందెలు ఏంది? జేబులో కత్తెర ఏంది? అని చురక అంటించారు. ముఖ్యమంత్రి మాట్లాడే మాటలా ఇవి… ఈ ప్రస్టేషన్ ఎందుకు? ఆవేశంతో ఊగిపోవడం ఎందుకు? మానవ బాంబును కూడా అవుతానని చెప్పాడని మండిపడ్డారు.
read also :CM Revanth : మల్లారెడ్డి కాళ్లబేరానికి వచ్చినట్లేనా..?
తాను రేవంత్ రెడ్డికి ఓ విజ్ఞప్తి చేస్తున్నానని… కాంగ్రెస్ పార్టీలో నీ పక్కనే బాంబులు ఉన్నాయని… నల్గొండ బాంబు, ఖమ్మం బాంబులు మీ ప్రభుత్వం మీద చేసేదేంత వారే చేస్తారన్నారు. రేవంత్ రెడ్డి అయిదేళ్లు అధికారంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని… 420 హామీలు అమలు చేయాలని కోరుకుంటున్నామన్నారు. వెలుగు… చీకటి రెండు చూస్తేనే వెలుగు విలువ తెలుస్తుందని… అలాగే కేసీఆర్, రేవంత్ రెడ్డిని చూశాక కేసీఆర్ విలువ ప్రజలకు తెలుస్తుందన్నారు. అందుకే రేవంత్ రెడ్డి బీపీ పెంచుకొని ఆగమాగం కావొద్దని.. మా నుంచి ఎలాంటి ప్రమాదం ఉండదని హామీ ఇచ్చారు. రేవంత్ రెడ్డికి ప్రమాదం అంటూ ఉన్నదంటే ఆయన పక్కన కూర్చున్న కాంగ్రెస్ నేతల నుంచే అన్నారు. బీపీ గోలీలు వేసుకొని హాయిగా ఉండాలని వ్యాఖ్యానించారు.
read also :Half Day schools : ఈ నెల 15 నుంచి తెలంగాణలో ఒంటిపూట బడులు..
గుజరాత్ మోడల్ గొప్పదని రేవంత్ రెడ్డి అంటున్నారని… నోటికి వచ్చినట్లు అబద్దాలు చెప్పడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. మన రైతుబంధును కాపీ కొట్టి కేంద్రం పీఎం కిసాన్ పెట్టిందని తెలిపారు. అలాగే మిషన్ కాకతీయను కాపీ కొట్టి అమృత్ సరోవర్ అని పేరు పెట్టారన్నారు. రాహుల్ గాంధీయేమో గుజరాత్ మోడల్ అట్టర్ ప్లాప్ అంటే రేవంత్ రెడ్డేమో గుజరాత్ మోడల్ కావాలని అంటున్నారని ధ్వజమెత్తారు. మూడు నెలల్లోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజాభిమానం కోల్పోయిందన్నారు.