Site icon HashtagU Telugu

KTR : హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన కేటీఆర్

KTR filed petitions in the High Court

KTR filed petitions in the High Court

KTR : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైకోర్టు ను ఆశ్రయించారు. బంజారాహిల్స్ , ముషీరాబాద్ పోలీస్ స్టేషన్లలో తనపై నమోదు చేసిన కేసులను కొట్టివేయాలని కోరుతూ కేటీఆర్ పిటిషన్‌లు వేశారు. ఎలాంటి కారణాలు కారణాలు లేకుండానే తనపై కేసులు నమోదు చేశారని ఆయన తన పిటిషన్‌లలో పేర్కొన్నారు. అయితే బిల్డర్లు, కాంట్రాక్టర్ల వద్ద నుంచి సీఎం రేవంత్ రెడ్డి రూ.2,500 కోట్లు తీసుకున్నారని కేటీఆర్ ఆరోపణలు చేయడంతో.. ఆయనపై ఈ కేసులు నమోదు అయ్యాయి.

Read Also: Anchor Rashmi : కింగ్‌ నాగార్జునకు యాంకర్ రష్మీ గౌతమ్ స్పెషల్‌ రిక్వెస్ట్‌

ఈ క్రమంలో కేటీఆర్ తనపై నమోదు చేసిన కేసులను కొట్టివేయాలని హైకోర్టును కోరుతూ శుక్రవారం రెండు వేర్వేరు పిటిషన్‌లు దాఖలు చేశారు. కాగా, కాంట్రాక్టర్లు, బిల్డర్ల నుంచి సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి రూ.2500 కోట్లను వసూలు చేసి ఢిల్లీకి పంపారంటూ 2024 మార్చి 27న చేసిన కామెంట్లపైనా తనపై కేసు నమోదు చేశారని కేటీఆర్ వెల్లడించారు. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌కు చెందిన బి.శ్రీనివాసరావురాజకీయ కక్షతో పెట్టిన ఈ కేసును కొట్టివేయాలని కోరారు.

అయితే సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌ను ఉద్దేశపూర్వకంగా అవమానించలేదని, ఆ విమర్శల వల్ల శాంతిభద్రతలకు విఘాతం ఏర్పడలేదని తన పిటిషన్ లో వివరించారు. ఈ రెండు కేసుల విచారణ ప్రక్రియను నిలిపివేసి..ఎఫ్ఐఆర్ లను కొట్టేయాలని పేర్కొన్నారు. కాగా..ఈ రెండు పిటిషన్ లను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌‌‌‌‌‌‌‌ కె.లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌ విచారించనున్నారు. ఈ కేసు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణలో ఉందని, ఆ కోర్టులో జరిగే విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని, మొత్తం విచారణ ప్రక్రియను నిలిపివేయాలని కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు.

Read Also: Pawan Kalyan : పవన్‌ కళ్యాణ్‌పై అనుచిత పోస్ట్‌.. కేసు నమోదు