Site icon HashtagU Telugu

Agreements : అదానీతో ఒప్పందాలు రద్దు చేయాలి: కేటీఆర్‌

Case Against KTR

Case Against KTR

KTR : భారతీయ వ్యాపార దిగ్గజం, అదానీ గ్రూప్ అధినేత, ప్రపంచ సంపన్నుల్లో ఒకరైన గౌతమ్ అదానీపై అమెరికాలోని న్యూయార్క్‌లో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మాట్లాడుతూ.. మరోసారి అంతర్జాతీయంగా అదానీ వ్యవహారం బయటపడిందని అన్నారు. ఆదానీ, రేవంత్‌ మధ్య 12,400 కోట్ల ఒప్పందం జరిగినట్లు కేటీఆర్‌ కీలక ఆరోపణలు చేశారు. దీనివల్ల భారత దేశ ప్రతిష్ట కు ప్రపంచ వ్యాప్తంగా భంగం కలిగిందని పేర్కొన్నారు. మేము అధికారంలో ఉన్నప్పుడు అదాని ని తెలంగాణ లో అడుగు పెట్టనివ్వలేదని గుర్తు చేశారు.

కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం 12400 కోట్ల రూపాయల తో అదాని తో ఎంవోయూ చేసుకున్నారని ఆరోపణలు చేశారు. హై కమాండ్ ఆదేశాలు లేకుండా ఆదాని తో ఈ ఒప్పందాలు జరుగుతున్నాయా చెప్పాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఏ పని జరగాలన్న హైకమాండ్ ఆదేశాలు కావాలన్నారు. చిన్న చిన్న కార్పొరేషన్ పదవులకు హైకమాండ్ ఆజ్ఞ లేనిది ఇవ్వరు.. అలాంటిది హైకమాండ్ ఆదేశాలు లేనిదే అదానీతో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వేల కోట్ల ఒప్పందాలు చేసుకుంటుందా? అని ప్రశ్నించారు. రామన్నపేటలో ఆదాని సిమెంట్ పరిశ్రమ వద్దు అని అక్కడి ప్రజలు వద్దు అని చెప్పినా తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో కొత్త ఆదాని సామ్రాజ్యాన్ని తెస్తున్నారని ఫైర్‌ అయ్యారు.

రాహుల్ గాంధీ ఢిల్లీలో రోజు అదానీని తిడుతాడు. కానీ తెలంగాణలో వేల కోట్ల ఒప్పందాలు చేసుకుంటాడని కేటీఆర్‌ ఆరోపణలు చేశారు. తక్షణం అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ అనుమతులను రద్దు చేయాలని.. అదానీతో చేసుకున్న చీకటి ఒప్పందాలు అన్నీ బయట పెట్టాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణలో ఆస్తులను కొల్లగొట్టే మీ కుయుక్తులలో మీ భడే భాయ్ వాటాఎంత ? మీ అదానీ భాయ్ వాటా ఎంత? మీ హైకమాండ్ వాటా ఎంత? అంటూ కేటీఆర్‌ సోషల్‌ మీడియా వేదికగా నిలదీశారు.

Read Also: Job calendar : దేశంలోనే వినూత్నంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన రేవంత్‌ సర్కార్