supreme court : జస్టీస్ ఎన్.కోటీశ్వర్ సింగ్, జస్టిస్ ఆర్. మహదేవన్లు సుప్రీంకోర్టు జడ్జీలుగా బాధ్యతలు చేపట్టారు. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డి.వై. చంద్రచూడ్ గురువారం వారితో ప్రమాణస్వీకారం చేయించారు. ఏప్రిల్ 11న జస్టిస్ అనిరుద్ధబోస్ వేసవి సెలవులకు కొద్ది రోజుల ముందు జస్టిస్ ఎ.ఎస్.బోపన్నలు పదవీ విరమణ చేయడంతో రెండు పోస్టులు ఖాళీ అయ్యాయి. దీంతో ఐదుగురు సభ్యులో కూడిన సుప్రీంకోర్టు కొలీజియం జులై 11న జస్టిస్ ఎన్. కోటీశ్వర్ సింగ్, జస్టిస్ ఆర్. మహదేవాన్ల పేర్లను ప్రతిపాదించగా.. వారం రోజులలోపే కేంద్ర ప్రభుత్వం నియామకాలకు అనుమతినిచ్చింది.
We’re now on WhatsApp. Click to Join.
సుప్రీంకోర్టులో మొదటిసారి ఈ శాన్య రాష్ట్రమైన మణిపూర్‌కు ప్రాతినిథ్యం దక్కిన విషయం తెలిసిందే. ఆ రాష్ట్రానికి చెందిన జస్టిస్ ఎన్.కోటీశ్వర్ సింగ్ మొదటిసారి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. కాగా, కొత్త నియామకాలతో మూడు నెలల తర్వాత సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 34కి చేరింది.
Read Also: Advisory For Indians : భారతీయులు ఇళ్లలోనే ఉండండి.. భారత ఎంబసీ హెచ్చరిక