Site icon HashtagU Telugu

KLH : రక్తదాన కార్యక్రమంలో కెఎల్‌హెచ్‌ ఎన్ఎస్ఎస్

KLH NSS at blood donation event

KLH NSS at blood donation event

KLH : హైదరాబాద్‌లోని శ్రీ పివి నరసింహారావు మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిర్వహించిన రక్తదాన శిబిరంతో ఆశల కేంద్రంగా తమ క్యాంపస్‌ ను కెఎల్‌హెచ్‌ అజీజ్‌నగర్‌లోని ఎన్ఎస్ఎస్ యూనిట్ మార్చింది. ఈ రక్తదాన శిబిరంలో విద్యార్థులు మరియు సిబ్బంది పెద్ద సంఖ్య లో పాల్గొన్నారు. వారి ఉత్సాహం ఈ శిబిరంలో స్పష్టంగా కనిపించింది. ఫలితంగా 150 యూనిట్లకు పైగా రక్తం సేకరించబడింది.

Read Also: Kasireddy Rajasekhar Reddy : లిక్కర్ స్కాం కేసు.. ఆడియో విడుదల చేసిన కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి

హైదరాబాద్‌లోని శ్రీ పివి నరసింహారావు మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ సీఈఓ డాక్టర్ ఎన్.వి. సుధాకిరణ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆపన్నుల సంక్షేమానికి చురుకుగా సహకరించడానికి, తద్వారా సామాజిక బాధ్యత యొక్క కీలకమైన లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లడానికి విద్యార్థులకు అవకాశాలను అందించడంలో చూపుతున్న నిబద్ధతకు కెఎల్ఈఎఫ్ విశ్వవిద్యాలయ యాజమాన్యానికి ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

కెఎల్ఈఎఫ్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్ కోనేరు లక్ష్మణ్ హవిష్, నిస్వార్థ దాతలను ప్రశంసించారు. ప్రాణాలను కాపాడే వారి స్వచ్ఛంద సహకారపు ప్రభావాన్ని నొక్కి చెప్పారు. సమాజానికి మరియు మానవాళికి సేవ చేయడానికి అందుబాటులో ఉన్న మార్గాలను స్వీకరించాలని ఆయన విద్యార్థులను ప్రోత్సహించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ రామకృష్ణ మరియు కెఎల్‌హెచ్‌ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎం పి మల్లేష్ అంకితభావంతో చేసిన ప్రయత్నాల ఫలితంగా ఈ కార్యక్రమం విజయవంతమైంది. ఈ కార్యక్రమం లో రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికీ ప్రశంసా పత్రాలను అందజేసి సత్కరించారు.

Read Also:  MP Mithun Reddy : లిక్కర్ స్కాం.. మిథున్‌రెడ్డిని 8 గంటల్లో ‘సిట్’ అడిగిన కీలక ప్రశ్నలివీ