మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో (Maharashtra Elections) బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి (Mahayuti) విజయం దాదాపు ఖారైనట్లే. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి సీట్లను కైవసం చేసుకునే దిశగా దూసుకెళ్తుంది. మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 స్థానాలు ఉండగా.. అధికారం చేపట్టేందుకు మ్యాజిక్ ఫిగర్ 145 సీట్లను సాధించాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం 220కి పైగా స్థానాల్లో మహాయుతి కూటమి ఆధిక్యంలో ఉంది. అయితే చాలా వరకు ఎగ్జిట్ పోల్స్ ఈ నెంబర్‌ను అంచనా వేయడంలో విఫలమయ్యాయి. కానీ కేకే సర్వే (KK Survey)మాత్రం ఈ ఫలితాలకు దగ్గరగా అంచనాలను వేసి మరోసారి తమ సర్వేనే నెం 1 అని చెప్పకనే చెప్పింది.
దేశ వ్యాప్తంగా ఏ ఎన్నికల పోలింగ్ జరిగిన ఆ వెంటనే సర్వేల ( Exit Poll) పై ప్రజలు ఫోకస్ చేస్తుంటారు. ఎంతోమంది..ఎన్నో సంస్థలు తమ సర్వేలకు అనుగుణంగా గెలుపు ఎవరిదీ..? ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో విజయం సాధిస్తుంది..? ఏ పార్టీకి ఎంత మెజార్టీ రాబోతుంది..? ఎవరు ఎక్కడ విజయం సాదించబోతున్నారు..? ఎంత మేర ఓట్లతో విజయం దక్కించుకోబోతున్నారు..? ఎంత పోలింగ్ శాతం జరిగింది..? ఓటర్ల నాడీ ఎలా ఉంది..? ఇలా అనేక రకాల ప్రశ్నలకు సమాదానాలు చెపుతుంటారు. మొన్న జరిగిన మహారాష్ట్ర – ఝార్ఖండ్ లలో జరిగిన ఎన్నికల పోలింగ్ (Maharashtra – Jharkhand Elections 2024) పూర్తికాగానే అనేక సర్వే సంస్థలు తమ తమ నివేదికలను ప్రకటించారు. అయితే అందరికంటే కేకే సర్వే చెప్పిందే జరిగింది.
మహారాష్ట్రలో మహాయుటి తన అధికారాన్ని నిలబెట్టుకుంటుందని కేకే సర్వే అంచనా వేసింది. భారీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని. మ్యాజిక్ ఫిగర్ ను దాటి ఏకంగా 225 స్థానాలను గెలుచుకుంటుందని స్పష్టం చేసిందీ KKసర్వే. తన రాజకీయ ప్రత్యర్థులకు ఎలాంటి అవకాశం ఇవ్వబోదని తెలిపింది. మహా వికాస్ అఘాడీకి ఈ ఎన్నికల్లో ఘోర పరాజయం తప్పదని , కేవలం రెండంకెలకే పరిమితమౌతుంది. 56 నియోజకవర్గాల కంటే ఎక్కువ సీట్లు మహా వికాస్ అఘాడీకి దక్కబోవు. ఇతరులు ఏడు చోట్ల విజయం సాధించగలరని తెలిపింది.
ఏపీలో తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సునామీ తరహాలో విజయం సాధిస్తుందని కేకే సర్వే అంచనా వేసిన విషయం తెలిసిందే. 175 నియోజకవర్గాలకు గాను టీడీపీ కూటమి 161 స్థానాల్లో గెలుస్తుందనీ తెలిపింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 14 సీట్లల్లో మాత్రమే విజయం సాధిస్తారని అప్పట్లో వెల్లడించింది. అదే జరిగింది. ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికల విషయంలో కూడా కేకే (KK) సర్వే చెప్పిందే జరగడం తో..ఇప్పుడు దేశ వ్యాప్తంగా కేకే సర్వే అనేది హాట్ టాపిక్ గా మారింది. మహాయుతి కూటమి 219 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక కాంగ్రెస్ కూటమి 55 చోట్ల ముందంజలో ఉండగా.. ఇతరులు 14 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.
Read Also : Wayanad : ప్రియాంక గాంధీకి రికార్డు విజయం ఖాయం: సీఎం రేవంత్ రెడ్డి