Site icon HashtagU Telugu

Kisna Diamond : ఏపీలో కిస్నా డైమండ్ అండ్ గోల్డ్ జ్యువెలరీ ప్రారంభం

Kisna Diamond and Gold Jewellery launched in AP

Kisna Diamond and Gold Jewellery launched in AP

Kisna Diamond : కిస్నా డైమండ్ అండ్ గోల్డ్ జ్యువెలరీ, ఆంధ్రప్రదేశ్‌లో తమ రెండవ ఎక్స్‌క్లూజివ్ షోరూమ్‌ను శ్రీకాకుళంలో ప్రారంభించినట్లు వెల్లడించింది. పాలకొండ రోడ్ , గాంధీ పార్క్ పక్కన ఉన్న ఈ షో రూమ్ ప్రారంభోత్సవంలో హరికృష్ణ గ్రూప్ వ్యవస్థాపకుడు & మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఘనశ్యామ్ ధోలాకియా పాల్గొన్నారు. మాతృ దినోత్సవం సమీపిస్తోన్న వేళ ప్రత్యేకంగా తీర్చిదిద్దిన ఆభరణాల కలెక్షన్ ను వినియోగదారులు అన్వేషించవచ్చు. డైమండ్ జ్యువెలరీ మేకింగ్ ఛార్జీలపై 50 – 100% వరకు తగ్గింపును అందుకోవచ్చు.

Read Also: Balakrishna : బాలకృష్ణ సెటైర్లు వేసింది చిరంజీవి పైనేనా..?

ఈ ప్రారంభం గురించి హరి కృష్ణ గ్రూప్ వ్యవస్థాపకుడు & మేనేజింగ్ డైరెక్టర్ ఘనశ్యామ్ ధోలాకియా మాట్లాడుతూ.. ‘‘ ఆంధ్రప్రదేశ్ సాంస్కృతికంగా మహోన్నత రాష్ట్రం కావటం తో పాటుగా ఆభరణాలకు పెరుగుతున్న మార్కెట్ గానూ నిలుస్తోంది. మా ప్రత్యేక షోరూమ్‌ను శ్రీకాకుళానికి తీసుకురావడం మాకు చాలా ఆనందంగా ఉంది. భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆభరణాల బ్రాండ్‌గా ఉండాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న మేము , ప్రతి మహిళ వజ్రాల ఆభరణాలను సొంతం చేసుకోవాలనే కలను నిజం చేస్తాము…” అని అన్నారు.

కిస్నా డైమండ్ & గోల్డ్ జ్యువెలరీ డైరెక్టర్ శ్రీ పరాగ్ షా మాట్లాడుతూ.. ‘‘మా శ్రీకాకుళం షోరూమ్ స్థానిక సౌందర్యాన్ని ప్రతిబింబించే డిజైన్లను ఆధునికత జోడించి అందిస్తుంది. ఇవి మదర్స్ డేకి సరిగ్గా సరిపోయేలా ఉంటాయి. మా ప్రత్యేక కలెక్షన్ ను అన్వేషించడానికి మరియు ఈ మదర్స్ డేని చిరస్మరణీయంగా మార్చుకోవడానికి మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము ” అని అన్నారు. కిస్నా ఫ్రాంచైజ్ పార్టనర్, శ్రీమతి సరిత & శ్రీ శ్రీనివాస రావు పుట్నూరు మాట్లాడుతూ.. ‘‘ నమ్మకమైన వారసత్వం ను శ్రీకాకుళంకు తీసుకువస్తూ కిస్నా తో భాగస్వామ్యం చేసుకోవటం పట్ల సంతోషంగా ఉన్నాము” అని అన్నారు. కమ్యూనిటీకి తిరిగి ఇవ్వాలనే కిస్నా నిబద్ధతకు అనుగుణంగా, ఈ బ్రాండ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించింది. వెనుకబడిన వర్గాల వారికి ఆహార పంపిణీ కార్యక్రమంను కూడా  నిర్వహించింది.

Read Also: Samsung : శామ్‌సంగ్ ఉపకరణాలపై భారీ తగ్గింపులు..!