Site icon HashtagU Telugu

Kishan Reddy : సికింద్రాబాద్ నుంచి గోవాకు కొత్త రైలు ప్రారంభించిన కిషన్ రెడ్డి

Kishan Reddy started a new train from Secunderabad to Goa

Kishan Reddy started a new train from Secunderabad to Goa

Secunderabad to Goa Train : కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ నుంచి గోవాకు కొత్త రైలు సర్వీసును ప్రవేశపెట్టింది. ఈ మేరకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జెండా ఊపి సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో గోవాకు వెళ్లే రైలును ఆదివారం నాడు ప్రారంభించారు. ఈ రైలు తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరీ ముఖ్యంగా పర్యాటకులకు ఎంతో సౌకర్యవంతంగా ఉండనుందన్నారు. ఇప్పటివరకు.. సికింద్రాబాద్ నుంచి గోవా వెళ్లేందుకు.. డైరెక్ట్ ట్రెయిన్ ఉండేది కాదన్నారు. వారానికి ఒక రైలు 10 కోచ్ లతో సికింద్రాబాద్ నుండి బయలుదేరి గుంతకల్ కు చేరుకొని అక్కడ తిరుపతి నుంచి గోవాకు వెళ్ళే మరో 10 కోచ్ లతో కలిసి గోవాకు వెళ్లేదన్నారు. దీంతోపాటుగా.. కాచిగూడ – యలహంక మధ్యన వారానికి 4 రోజులు ప్రయాణం సాగించే రైలుకు గోవాకు వెళ్ళే 4 కోచ్ లను కలిపేవారు. ఈ 4 కోచ్ లను తిరిగి గుంతకల్ వద్ద షాలిమార్ – గోవా మధ్యన తిరిగే రైలుకు కలిపి ప్రయాణం సాగించేవారన్నారు. ఇలా సికింద్రాబాద్ – గోవా మధ్య రైళ్లన్నీ 100 ఆక్యుపెన్సీతో వెళ్లడం, చాలా మంది సీట్లు దొరక్క ఇబ్బందులు పడుతున్న విషయం నా దృష్టికొచ్చిందని తెలిపారు.

Read Also: KTR : రైతు భరోసా మోసం.. కౌలు రైతులకూ అందని సాయం: కేటీఆర్‌

దీన్ని పరిష్కరించాలని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ గారిని అడగటం.. దీనికి వారు అంగీకరించి.. ఈ కొత్త రైలును ప్రకటించడం సంతోషకరం అన్నారు. వారికి ఈ సందర్బంగా ఈ వేదిక ద్వారా భారత ప్రధాని మోడీ గారికి, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారికి ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తున్నానని తెలిపారు. దాదాపు 20 గంటలపాటు సాగే ఈ ప్రయాణం.. తెలుగు రాష్ట్రాలతోపాటుగా కర్ణాటక ప్రజలకు కూడా ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. ఈ మూడు రాష్ట్రాల పర్యాటక రంగాభివృద్ధికి, వాణిజ్య, సాంస్కృతిక సంబంధాలు మరింత బలోపేతానికి కూడా సికింద్రాబాద్-గోవా ప్రత్యేక రైలు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ బైవీక్లీ రైలు బుధ, శుక్రవారాల్లో సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతుంది. వాస్కోడగామా నుంచి గురువారం, శనివారం తిరుగు ప్రయాణం అవుతుందని తెలిపారు. ఇది సికింద్రాబాద్, కాచిగూడ, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, గద్వాల్, కర్నూల్ సిటీ, డోన్, గుంతకల్, బెళ్లారి, హోస్పేట, కొప్పల్, గడగ్, హుబ్బళ్లి, ధార్వాడ్, లోండా, క్యాసిల్ రాక్, కులెం, సాన్వోర్‌డెమ్, మడగావ్ జంక్షన్లలో ఆగుతూ.. వాస్కోడగామా చేరుకుంటుందన్నారు. తాజా రైలు సర్వీసులతో దేశంలో పర్యాటకానికి మరింత తోడ్పాడు అందుతుందని, దాంతోపాటు ఇక్కడి నుంచి గోవాకు వెళ్లే వారికి రైలు ప్రయాణం ఈజీ అవుతుంది.

Read Also: Google Badges : గూగుల్‌లోనూ వెరిఫికేషన్ బ్యాడ్జీలు.. ఫేక్ అకౌంట్స్‌కు చెక్