32 Kgs Gold seized: నడి సముద్రంలో కేజీఎఫ్ క్లైమాక్స్ రిపీట్.. 32 కేజీల బంగారం స్వాధీనం!

కేజీఎఫ్ సినిమాలో మాదిరిగా కస్టమ్స్ అధికారులు 32 కేజీల బంగారాన్ని గుర్తించారు.

  • Written By:
  • Updated On - June 2, 2023 / 11:20 AM IST

సినిమా ఓ బలమైన మాధ్యమం. ప్రేక్షకులపై తీవ్ర ప్రభావం చూపుతూ హీరోలు, విలన్ల మాదిరి రూపాంతరం చెందేలా పరోక్షంగా ఎంకరేజ్ చేస్తుంటాయి. ఈ మధ్య జనాల్లోకి వచ్చిన కేజీఎఫ్, పుష్ప సినిమాలు సామాన్య ప్రేక్షకులపైనే కాకుండా స్మగ్లర్లు, దొంగలు, పోలీసులపై తీవ్ర ప్రభావం చూపాయి. గంధపు చెక్కలు దొంగలు చాలామంది పుష్ప సినిమా స్టైయిల్ లో అక్రమ రవాణా చేస్తూ దొరికిపోయిన ఘటనలు కూడా ఉన్నాయి. రాఖీభాయ్, పుష్ప రాజ్ ల మాదిరిగా కొత్త అవతారమెత్తుతూ తమదైన స్థాయిలో స్మగ్లింగ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది స్మగ్లర్లు బంగారం తరలిస్తూ కోస్ట్ గార్డ్ పోలీసులకు పట్టుబడ్డారు.

శ్రీలంకనుంచి భారత్ కు సముద్ర మార్గం ద్వారా ఈ బంగారాన్ని తరలిస్తున్నారు. మొత్తం 32.60 కిలోల బంగారాన్ని సీజ్ చేశారు అధికారులు. దీని విలువ 20కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. భయపడి సముద్రంలో పడేశారు. ఈ ఘటన ఇంచుమించు కేజీఎఫ్ సినిమా మాదిరిగా ఉంది. ఆ సినిమాలో హీరో సైతం పెద్ద షిప్ లో బంగారం తరలిస్తున్న సమయంలో పోలీసులు దాడి చేస్తే ఆ బంగారమంతా సముద్రం పాలు చేస్తాడు. ఇక్కడ కూడా స్మగ్లర్లు అదే చేస్తారు.

కొంతమంది స్మగ్లర్లు శ్రీలంకనుంచి భారత్ కు అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్నట్లు డిఆర్‌ఐ అధికారులకు సమాచారం అందింది. కోస్ట్ గార్డ్, కస్టమ్స్ అధికారలుతో కలసి వారు తమిళనాడు తీరంలో నిఘా పెట్టారు. మండపం ఫిషింగ్ హార్బర్ సమీపంలో రెండు పడవలపై వారికి అనుమానం వచ్చింది. వాటిని కోస్ట్ గార్డ్ సిబ్బంది వెంబడించారు. పోలీసులకు దొరికిపోతామన్న భయంతో 11.6 కేజీల బంగారం కడ్డీలను స్మగ్లర్లు సముద్రంలో పడేశారు. ఆ తర్వాత తప్పించుకోవాలని చూశారు. అయితే కోస్ట్ గార్డ్ సిబ్బంది వారిని వదల్లేదు. అదుపులోకి తీసుకుని బంగారాన్ని వెలికి తీయడానికి ప్రయత్నించారు. గజ ఈతగాళ్లు, డైవర్ల సహాయంతో రెండురోజులపాటు శ్రమించారు. సముద్రంలో పారేసిన బంగారాన్ని వెలికి తీశారు. మరో పడవలో ఉన్న 21 కేజీల బంగారాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read: Ola Electric Scooters: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లకు పెరిగిన డిమాండ్.. మే నెలలో 35,000 యూనిట్ల అమ్మకాలు