Mother And Son: కొడుకు కోసం చదివి ఒకేసారి ఉద్యోగాలు కొట్టిన తల్లి కొడుకు..!

  • Written By:
  • Publish Date - August 9, 2022 / 09:00 PM IST

సాధారణంగా తల్లిదండ్రులు పిల్లలు చదువుకోకపోతే చదువుకోమని చెబుతూ ఉంటారు. ఒకవేళ చదువుకున్న తల్లిదండ్రులు అయితే పిల్లలను దగ్గర కూర్చోబెట్టుకుని మరీ చదువు చెబుతూ ఉంటారు. అలా తాజాగా ఒక తల్లి కూడా తన కొడుకుని చదివిస్తూ ఆమె కూడా చదివి కొడుకుతో పాటుగా ఆమె కూడా ఉద్యోగం సంపాదించింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కేరళకు చెందిన 42 ఏళ్ల బిందు అనే మహిళ అంగన్ వాడీ టీచర్ గా పనిచేసేది. ఆమె తన కుమారుడిని బాగా చదివించాలి అనుకుంది. ఈ క్రమంలోనే కుమారుడికి పాఠాలు బాగా అర్థం చేయించేందుకు తానూ పుస్తకాలు చదివింది.

అలా కొడుకు కోసం ఆమె బాగా కష్టపడింది. అయితే కొడుకుకి అర్థమయ్యే విధంగా చెప్పడం కోసం ఆ మహిళ కష్టపడుతూ కుమారుడిని ప్రోత్సహిస్తు ఆమె కూడా సబ్జెక్టులన్నింటి పై పట్టును సాదించింది. కాగా ఇటీవల ప్రభుత్వ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పరీక్షల్లో కుమారుడితోపాటు ఆమెకూ ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. బిందు దాదాపు పదేళ్ల కిందట తన కుమారుడి కోసం పుస్తకాలు పట్టి అలా చదువుతూ చదువుతూ కుమారుడిని డిగ్రీ వరకు ప్రోత్సహించింది. అలా తల్లి కొడుకులు ఇద్దరూ ప్రతి టాపిక్ పై కలిసి డిస్కస్ చేస్తూ పరీక్షలకు సిద్ధం చేసింది. అలా
ఆ తర్వాత కుమారుడు ఉద్యోగం సాధించాలని ఓ కోచింగ్ సెంటర్ లో చేర్పించింది. అయితే కుమారుడితో పాటు తానూ అందులో చేరి ప్రభుత్వ ఉద్యోగం కోసం కోచింగ్ తీసుకుంది. వరుసగా ప్రభుత్వ పోటీ పరీక్షలు కూడా రాయడం మొదలుపెట్టింది.

అలా తల్లీ కుమారుడు కలిసి ఇప్పటివరకు మూడు సార్లు పోటీ పరీక్షలు రాశారు. అయితే ఇటీవల తల్లి, కుమారుడు ఇద్దరూ కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు రాశారు. అందులో లాస్ట్ గ్రేడ్ సర్వెంట్స్ పరీక్షలో బిందుకు రాష్ట్రంలోనే 92వ ర్యాంకు వచ్చింది. బిందు 24 ఏళ్ల కుమారుడికి లోయర్ డివిజనల్ క్లర్క్ పరీక్షలో 38వ రాష్ట్ర ర్యాంకు వచ్చింది. ఇద్దరికీ ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగాలు ఖాయం కావడంతో వారి కుటుంబంలో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే కొడుకు కోసం పుస్తకాలు చేత పట్టిన ఆ తల్లికి కొడుకుతోపాటు ఉద్యోగం రావడంతో సంతోషాలతో తేలిపోతోంది ఆ తల్లి.