Public Row: కేరళలో హస్తప్రయోగంపై దుమారం, ఘటనపై మహిళల భిన్నవాదనలు!

అసభ్యకర వీడియోలు చూస్తూ మహిళల మధ్య హస్త ప్రయోగం చేశాడు ఓ వ్యక్తి.

  • Written By:
  • Updated On - May 20, 2023 / 05:05 PM IST

వెస్ట్రన్ కల్చర్ ప్రభావమో, లేక సినిమాల (Cinema) వ్యామోహమో.. కానీ ఈ తరం మనుషులు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. నాలుగు గోడల మధ్య చేయాల్సిన పనులను బహిరంగ ప్రదేశాల్లోనే చేసేస్తున్నారు. ఇటీవల ఢిల్లీ మెట్రో (Metro)లో ఓ యువకుడు హస్త ప్రయోగం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై అప్పట్లో ఢిల్లీలో అనేక విమర్శలు వచ్చాయి. తాజాగా ఓ కేరళలో ఈ ఘటన జరిగింది. ఓ వ్యక్తి ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో ఇద్దరి మహిళలు మధ్య కూర్చున్నాడు. అయితే మొబైల్ లో అసభ్యకర వీడియోలు చూస్తూ మహిళల మధ్య హస్త ప్రయోగం చేశాడు. దీంతో ఇద్దరు మహిళలు ఆ వ్యక్తిపై డ్రైవర్ కు కంప్లైంట్ చేశారు. అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నించంగా, కిటికీ నుంచి దూకి పారిపోయాడు. దీంతో అతడిని కండక్టర్ కేకే ప్రదీప్‌తోపాటు మరికొందరు సహ ప్రయాణికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అనంతరం నందిత ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో మహిళల భద్రతపై పలు చర్చలు జరిగాయి.

ఒక పురుషుడు (Male) బహిరంగ ప్రదేశాల్లో తన జననాంగాలను బయటపెట్టకూడదు. చాలా మంది మహిళలు రోజువారి జీవితంలో ఇలాంటి అసభ్యకరమైన కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ ఘటన కేరళలో చర్చకు దారితీసింది. ‘‘ఆ వ్యక్తి హస్తప్రయోగం ప్రారంభించేవరకు ఆమె ఎందుకు వేచి ఉంది. అతని ముఖాన్ని బహిర్గతం చేసి, సోషల్ మీడియాలో అవమానించడం ఎంతవరకు కరెక్ట్’’ అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

హస్తప్రయోగం సంఘటన గురించి ఓ మహిళ ఫేస్‌బుక్ (Face Book)లో పోస్ట్ పెట్టింది. నందిత అనే మహిళ ధైర్యాన్ని ఆమె ప్రశంసిస్తూనే ఇలా ప్రశ్నించింది. “అయితే ఈ నియమాలు మహిళలకు కూడా వర్తిస్తాయి? తమను తాము ఎక్స్ పోజ్ ఎందుకు చేసుకోవాలా? ఎర్రని లిప్‌స్టిక్‌తో, రెచ్చగొట్టే దుస్తులు ధరించాలా ? అతను తన స్వంత శరీరానికి నచ్చిన పనిని చేస్తున్నాడు” అంటూ రియాక్ట్ అయ్యింది. అయితే ఈ ఘటనపై పట్ల కొందరు మహిళలు వ్యతిరేకంగా మాట్లాడితే, మరికొందరు మద్దతు తెల్పడం కేరళలో హాట్ టాపిక్ గా మారింది.

Also Read: TTD Temple: మరో తిరుమలగా కరీంనగర్, 40 కోట్లతో టీటీడీ ఆలయ నిర్మాణం!