Kerala Lottery: అదృష్టం అంటే ఇదే.. ఇల్లు అమ్ముతుండగా జాక్‌పాట్.. లాటరీ గెలిచిన వ్యక్తి?

సాధారణంగా ప్రతి ఒక్కరికి ఎన్నో ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతూ ఉంటాయి. ఇలా ఆర్థిక ఇబ్బందులు వచ్చిన నేపథ్యంలో చాలామంది ఆర్థిక కష్టాల నుంచి బయటపడటం కోసం ఉన్న ఇంటిని, స్థలాలను అమ్మడం మనం చూస్తుంటాము.

Published By: HashtagU Telugu Desk
Kerala Man Lottery

Kerala Man Lottery

సాధారణంగా ప్రతి ఒక్కరికి ఎన్నో ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతూ ఉంటాయి. ఇలా ఆర్థిక ఇబ్బందులు వచ్చిన నేపథ్యంలో చాలామంది ఆర్థిక కష్టాల నుంచి బయటపడటం కోసం ఉన్న ఇంటిని, స్థలాలను అమ్మడం మనం చూస్తుంటాము.ఈ క్రమంలోనే కేరళకు చెందిన ఓ వ్యక్తి సైతం ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడటం కోసం ఎంతో కష్టపడి కట్టుకున్న తన ఇంటిని అమ్మకానికి పెట్టారు. ఇక మరో రెండు గంటలలో ఇల్లు అమ్మేస్తున్న నేపథ్యంలో అతనికి ఒక ఫోన్ కాల్ వచ్చింది.అయితే తను లాటరీలో కోటి రూపాయలు గెలిచినట్టు తెలియడంతో ఒక్కసారిగా ఆ వ్యక్తి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

కేరళలోని మంజేశ్వర్‌కు చెందిన మహ్మద్ అనే వ్యక్తి కొన్ని రోజులుగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. ఎంతో డబ్బు ఖర్చు చేసి ఘనంగా తన కూతురు పెళ్లి చేసిన మహ్మద్ ప్రస్తుతం ఆ అప్పులను తీర్చడం కోసం ఏకంగా తన ఇంటిని అమ్మేయాలని ప్రయత్నం చేశారు. అయితే ఇంటికి సంబంధించిన కొనుగోలుదారులతో ఒప్పందం కూడా పూర్తి అయింది.కరోనా సమయంలో తన కూతురు పెళ్లితో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన పూర్తిగా నష్టపోవడంతో చివరకు ఇల్లు అమ్మే పరిస్థితికి వచ్చారు.

ఇక మరో రెండు గంటలలో డీల్ కూడా కుదురుతుంది అనే సమయంలో తాను లాటరీలో కోటి రూపాయలు గెలుచుకున్నారని ఫోన్ రాగానే అతను ఎంతో సంతోషపడ్డారు. అయితే తనకు కోటి రూపాయలు వచ్చాయని తెలియగానే అప్పులు ఇచ్చిన వారందరూ కూడా తనను వేధించడం మానేశారని అయితే ఆ డబ్బులు ఎప్పుడు తనకు వస్తాయో మాత్రం తెలియదని, కోటి రూపాయలలో ప్రభుత్వానికి టాక్స్ చెల్లించగా తనకు సుమారు 63 లక్షల వరకు డబ్బులు వస్తాయని మహ్మద్ వెల్లడించారు.

  Last Updated: 31 Jul 2022, 10:52 PM IST