Inspirational Couple: కేరళలో బస్సు నడుపుతున్న దంపతులు.. వీరి కథ తెలిస్తే వావ్ అనాల్సిందే!

సాధారణంగా మనం బస్సులో ప్రయాణించేటప్పుడు అప్పుడప్పుడు లేడీ కండక్టర్లను చూస్తూ ఉంటాం. ఇక లేడీ బస్

  • Written By:
  • Publish Date - July 21, 2022 / 08:30 AM IST

సాధారణంగా మనం బస్సులో ప్రయాణించేటప్పుడు అప్పుడప్పుడు లేడీ కండక్టర్లను చూస్తూ ఉంటాం. ఇక లేడీ బస్ డ్రైవర్లు అంటే చాలా అరుదుగా మాత్రమే చూసి ఉంటాము. కానీ ఇప్పుడు మనం తెలుసుకోబోయే సంఘటనలో మాత్రం బస్సు డ్రైవర్ బస్ కండక్టర్ ఇద్దరు కూడా భార్యాభర్తలే. ఏంటా అని ఆశ్చర్యపోతున్నారా! మీరు విన్నది నిజమే. అయితే అలా అని ఆ బస్సు వాళ్ళ సొంత బస్సు కూడా కాదు. ఇద్దరు భార్యాభర్తలు ఒక బస్సు ని నడుపుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. కేరళ అలప్పుజా జిల్లాలోని హరిపాద్ కెఎస్ఆర్టిసి డిపో పరిధిలోనే ప్రయాణికులు ఈ బస్సులో జర్నీ చేస్తూ ఉంటారు. ఈ బస్సు అంటే వారికి చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే కాస్త లేట్ అయినా పర్వాలేదు కానీ ఈ బస్సు వచ్చే వరకు ఆగి మరీ అందులో ప్రయాణిస్తారు.

ఇందుకు సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతతోంది. ఆ వీడియోలో గిరి,తారా అని ఇద్దరు భార్యాభర్తలు కలిసి బస్సును నడుపుతున్నారు. అయితే ఇందుకోసం ప్రభుత్వాన్ని పర్మిషన్ కూడా కోరారు. అనుమతి లభించడంతో బస్సు పై సొంత పెట్టుబడి పెట్టి, గిరి బస్సును డ్రైవ్ చేస్తుండగా అతని భార్య తారా కండక్టర్ గా పని చేస్తోంది. అయితే ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటున్న ఈ బస్సును ఆ జంట కలర్ ఫుల్ గా డెకరేట్ చేసింది. అంతేకాకుండా ఆ బస్సు లోపల మ్యూజిక్ సిస్టం, ఆరు సీసీ కెమెరాలు, ఎమర్జెన్సీ స్విచ్ లు, ఎల్ఈడి డెస్టినేషన్ బోర్డ్, ఆటోమేటిక్ ఎయిర్ ఫ్రెష్ నర్స్ ఇలా అబ్బో ఎన్నో సౌకర్యాలు ఉన్నాయి.

తాజాగా ఇందులో ప్రయాణించే ఒక ప్రయాణికుడు ఆ బస్సుకు సంబంధించిన వీడియోను తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే వీరి ప్రేమ కథ మరొక ఎత్తు అని చెప్పవచ్చు. ఈ దంపతులు ఇద్దరూ 22 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. మొదటిసారిగా 2000 సంవత్సరంలో ఒక ప్రైవేట్ సంస్థలో కలిశారు. ఆ తర్వాత ప్రేమలో పడ్డ ఈ జంట ఇరు కుటుంబ సభ్యులను వారిని ఒప్పించి పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. అందుకోసం టైం పట్టే విధంగా ఉండటంతో ఈ లోపు కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ రాయాలని డిసైడ్ అయ్యారు. అలా గిరి 2007లో పాస్ అవ్వగా, తారా 2017 లో పాస్ అయింది. అయినా కూడా వారి పెళ్లికీ పరిస్థితులు అనుకూలించలేదు. అలా మొత్తానికి ఈ జంట 2020లో పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. అసలైన ప్రేమకు నిదర్శనంగా నిలుస్తున్నారు ఈ కేరళ జంట.