Russia War Effect : కేరళలో రెస్టారెంట్ మెనూ నుంచి రష్యా సలాడ్ అవుట్

రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం తారస్థాయికి చేరుకుంది. ఇప్పటికే ఉక్రెయిన్ లో ప్రధాన నగరాలను కైవసం చేసుకుంటోంది. కానీ ఈ సమరం సెగ ప్రపంచాన్ని తాకుతోంది. అందుకే అమెరికాతోపాటు యూరప్ దేశాలు చాలా కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నాయి.

Published By: HashtagU Telugu Desk
Russian Salad

Russian Salad

రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం తారస్థాయికి చేరుకుంది. ఇప్పటికే ఉక్రెయిన్ లో ప్రధాన నగరాలను కైవసం చేసుకుంటోంది. కానీ ఈ సమరం సెగ ప్రపంచాన్ని తాకుతోంది. అందుకే అమెరికాతోపాటు యూరప్ దేశాలు చాలా కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నాయి. రష్యాలో తయారైన ఆహార పదార్థాలను కాని, డ్రింక్స్ ను కాని తమ దేశాల్లో అమ్మకుండా, వినియోగించకుండా నిషేధం విధించాయి. కానీ ఇప్పుడా వేడి మనదేశంలోని కేరళ వరకు చేరింది.

అసలు రష్యా యుద్ధానికి, కేరళకు సంబంధమేంటి అనుకోవచ్చు? దీనికి చాలా దగ్గరి బంధముంది. కేరళ వాసులు ఆహార ప్రియులు. వెరైటీ ఫుడ్ ను టేస్ట్ చేయడానికి ఇష్టపడతారు. ఆమాటకొస్తే భారతీయులు భోజనప్రియులే. అందుకే మన ఆహారపదార్థాల్లో విభిన్న రుచులు గల ఫుడ్ ఉంటుంది. అలాగే కేరళలోని ఫోర్ట్ కొచ్చిలో ఉన్న ‘కా కషీ ఆర్ట్ కేఫ్ అండ్ గ్యాలరీ’ రెస్టారెంట్ యజమని గట్టి నిర్ణయం తీసుకున్నాడు.

ఉక్రెయిన్ పై రష్యా యుద్ధానికి నిరసరగా తమ రెస్టారెండ్ మెనూలో నుంచి రష్యా సలాడ్ ను తీసేశాడు. రష్యా సలాడ్ ను తొలగించిన విషయాన్ని కేఫ్ ఓనర్ పింటో.. ఓ బోర్డ్ మీద రాసి దానిని బయట పెట్టాడు. అందులో ఏముందంటే.. ఉక్రెయిన్ ప్రజలకు మద్దతును ప్రకటిస్తూ.. తమ మెనూ నుంచి రష్యన్ సలాడ్ ని తీసేశాం అని రాసుకొచ్చాడు. ఆ బోర్డును కాస్తా సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో అది కాస్తా వైరల్ గా మారింది.

కేఫ్ యజమాని చేసిన పనికి కొంతమంది నెటిజన్లు మద్దతు పలుకుతుంటే.. మరికొందరు మాత్రం విమర్శల వర్షం కురిపిస్తున్నారు. అయినా సరే కేఫ్ యజమాని పింటో మాత్రం తగ్గేదే లే అని చెబుతున్నాడు. అయినా తాము రష్యన్లను వ్యతిరేకించడం లేదని.. వార్ ని ఆపాలని కోరుకుంటున్నామని చెప్పాడు. అందుకే ఇది ఒక మెసేజ్ లా ఉపయోగపడుతుందన్న ఆలోచనతోనే ఇలా చేశానన్నాడు. ఏదేమైనా ఐడియా అదుర్స్ అంటున్నారు. ఈ దెబ్బకు రెస్టారెంట్ బిజినెస్ తగ్గడం కాకుండా పెరుగుతుందని చెబుతున్నారు.

  Last Updated: 07 Mar 2022, 11:50 AM IST