KCR:మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్(brs) అధినేత కేసీఆర్(kcr) రేపు పలు జిల్లాల్లో పర్యటించనున్నారు. నీరు లేక ఎండిపోతున్న పొలాలను ఆయన పరిశీలించనున్నారు. అనంతరం, బాధిత రైతులతో సమావేశమవుతారు. జనగాం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో ఆయన పర్యటిస్తారు. పలువురు కీలక నేతలు పార్టీని వీడుతున్న నేపథ్యంలో కేసీఆర్ పర్యటనకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది.
We’re now on WhatsApp. Click to Join.
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపిక, సభలు, సమావేశాలతో బిజీగా ఉంటే, కేసీఆర్ మాత్రం రైతుల(Farmers)కు మనోధైర్యం కల్పించేందుకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. తమకు ఎన్నికల కన్నా రైతుల కన్నీళ్లు తుడవటమే అత్యంత ముఖ్యమని బీఆర్‌ఎస్ కార్యాచరణ నిరూపిస్తున్నదని ఆ పార్టీ శ్రేణులు చెప్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఆగమై, చిక్కిశల్యమైపోయిన వ్యవసాయాన్ని పదేండ్ల కఠోర శ్రమతో దరికి చేర్చిన బాధ్యతాయుతమైన పార్టీగా, ఆ పార్టీకి సారధ్యం వహిస్తున్న తెలంగాణ సాధకుడిగా.. కేసీఆర్ రైతులకు ధైర్యాన్ని ఇవ్వాలని నిర్ణయించుకున్నారని అందుకే జిల్లాల పర్యటన తలపెట్టారని బీఆర్‌ఎస్ నేతలు చెప్తున్నారు. అందులో భాగంగానే రైతు కేంద్రంగా తాము పోరుపతాక ఎగురవేస్తున్నామని గులాబీదళం స్పష్టం చేస్తున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన మాటను కాంగ్రెస్ పార్టీ నిలుపుకోని కారణంగానే రాష్ట్ర రైతాంగం దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నదని, ఈ తరుణంలో రైతులకు బాసటగా నిలవాలని బీఆర్‌ఎస్ నిర్ణయించింది.
Read Also: Criminal Case Against KTR: కేటీఆర్‌పై క్రిమినల్ కేసు నమోదు.. కారణమిదే..?
రైతులను అన్ని రకాలుగా ఆదుకుంటామని నమ్మించిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చి వంద రోజులు దాటినా హామీలను అమలు చేయకపోగా మరింత కుంగదీసే చర్యలకు పాల్పడుతున్నదని బీఆర్‌ఎస్ విమర్శిస్తున్నది. రైతులకు అండగా నిలిచేందుకు ఆదివారం నుంచి కేసీఆర్ జిల్లాల్లో పర్యటిస్తారని పార్టీ స్పష్టం చేసింది. ఇప్పటికే రైతుల కోసం అవసరమైతే సచివాలయాన్ని ముట్టడిస్తామని మాజీ మంత్రి హరీశ్‌రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించడంతోపాటు రైతులను ఆదుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
Read Also: Prabhas Kalki 2898 AD : ఇంతకీ కల్కి లో విలన్ ఎవరు.? నాగ్ అశ్విన్ ప్లాన్ ఏంటి..?
ఓవైపు సాగునీరు అందక ఎండుతున్న పంట లు.. మరోవైపు అకాల వర్షాలతో అల్లాడుతున్న రైతాంగం.. సకాలంలో అందని రైతుబంధు.. వీటికితోడు రైతులకు బ్యాంకుల నోటీసులు.. ఒక్కసారిగా చుట్టుముట్టిన కష్టనష్టాలను తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతులు.. ఇటువంటి పరిస్థితుల్లో రైతులకు అండగా నిలవాలని బీఆర్‌ఎస్ నిర్ణయించింది. అసెంబ్లీ ఎన్నికల సమయం లో రైతుభరోసా కింద రైతులు, కౌలురైతులకు ఎకరాకు రూ.15 వేల చొప్పున పెట్టుబడిసాయం, అధికారంలోకి రాగానే రూ.2 లక్షల రుణమాఫీ తదితర హామీలను నిలబెట్టుకోవడంలో కాంగ్రెస్ విఫలమైందని బీఆర్‌ఎస్ ఆరోపిస్తున్నది. రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను నల్లగొండ, కరీంనగర్ సభల్లో ఎలుగెత్తి చాటినప్పటికీ, ప్రభుత్వం స్పందించని కారణంగానే క్షేత్రస్థాయిలోకి వెళ్లాల్సి వస్తున్నదని బీఆర్‌ఎస్ నేతలు వివరిస్తున్నారు.