Site icon HashtagU Telugu

Kavitha : మరోసారి ఎమ్మెల్సీ కవిత రిమాండ్‌ పొడిగింపు

Kavitha judicial remand extended till July 3

Judicial custody extended to MLC Kavitha once again

Delhi Liquor ED case: ఢిల్లీ లిక్కర్‌ ఈడీ కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Kavitha) జ్యుడీషియల్‌ రిమండ్‌(Judicial remand)ను జూలై 3 వరకు పొడిగించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన ఈడీ, సీబీఐ రెండు కేసుల్లో కవిత రిమాండ్ సోమవారంతో ముగిసింది. దీంతో తీహార్ జైలు అధికారులు. కవితను ఈరోజు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పర్చారు.

We’re now on WhatsApp. Click to Join.

అయితే ఈడీ(Ed)అధికారులు వాదనలు పరిగణలోకి తీసుకున్న కోర్టు కవిత జ్యుడీషియల్ కస్టడీని జూలై 3వ తేదీ వరకు పొడిగించింది. దీంతో ఆమెను మళ్లీ తీహార్ జైలుకు పోలీసులు తరలిస్తున్నారు. కాగా, ఢిల్లీ లిక్కర్ ఈడీ, సీబీఐ రెండు కేసుల్లో కవిత జ్యుడీషియల్ రిమాండ్ ఇవాళ్టితో ముగిసింది. ఈ తరుణంలోనే కాసేపటి క్రితమే..రౌస్ ఎవిన్యూ కోర్టులో కవితను తీహార్ జైలు అధికారులు హాజరుపరిచారు. ఈ కేసును విచారించిన కోర్టు…ఢిల్లీ లిక్కర్ ఈడి కేసులో జూలై 3 వరకు కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగించింది.

Read Also: TDP : టీడీపీ కంచుకోట ఆ రెండు నియోజకవర్గాలు..!

ఇక పోతే సీబీఐ కేసు(CBI case)లో మధ్యాహ్నం విచారణ ఢిల్లీ లిక్కర్ ఈడి కేసు విచారణ జరుగనుంది. లిక్కర్ కేసులో మార్చి 15న ఈడి అధికారులు కవితను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఇక, ఏప్రిల్ 11న తీహార్ జైలు నుంచి ఆమెను సీబిఐ అరెస్ట్ చేసింది.