Liquor Scam Case: మంద్యం పాలసీ కేసులో అరెస్టయిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈరోజు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు(Delhi Rouse Avenue Court)లో హాజరుపర్చనున్నారు. జ్యుడీషియల్ కస్టడీ(Judicial Custody) ముగియనుండడంతో ఆమెను ఇవాళ కోర్టు ఎదుట హాజరు పరచనున్నారు. కవితతో పాటు మరో నలుగురిని నిందితులుగా పేర్కొంటూ రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ దాఖలు చేసిన, అనుబంధ చార్జిషీట్‌ను, ట్రయల్ కోర్టు పరిగణలోకి తీసుకుంది. దీంతో కవితతో సహా నలుగురు నిందితులు కోర్టులో హాజరుకావాలంటూ రౌస్ అవెన్యూ కోర్టు సమన్లు జారీ చేసింది. మార్చి 26 నుండి కవిత జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
కాగా, ఈ ఏడాది మార్చి 15న హైదరాబాద్‌లోని తన ఇంట్లో కవితను ఈడీ అరెస్టు(ED arrested) చేసింది. ఆ తర్వాత జ్యూడీషియల్ రిమాండ్ కోసం కోర్టు తీహార్ జైలు కు తరలించింది. లిక్కర్ పాలసీని తమకు అనుకూలంగా రూపొందించినందుకు ఆమ్ ఆద్మీ పార్టీకి సౌత్ గ్రూప్ రూ.100 కోట్ల రూపాయలు లంచం ఇచ్చారని ఈడీ, సీబీఐలు ఆరోపించాయి. ఈ లిక్కర్ వ్యవహారంలో కవిత పాత్ర కూడా ఉందని.. ఆమెకు ఇండోస్పిరిట్ లో 33% వాటా ఉందని ఆరోపణలతో చివరికి ఆమె అరెస్టయ్యింది.
Read Also: Election Counting : ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్..
మరోవైపు ఏప్రిల్ 29న ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా చార్జిషీట్‌ను పరిగణలోకి తీసుకోవాలని ఆదేశించారు. అయితే.. కవిత, చరణ్‌ప్రీత్‌లు ఇప్పటికే జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నందున.. వారికి కోర్టు ప్రొడక్షన్ వారెంట్లు జారీ చేసింది. దామోదర్ శర్మ, ప్రిన్స్ కుమార్, అరవింద్ సింగ్‌లు జూన్ 3న కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశించింది.అయితే కవిత జ్యుడీషియల్ కస్టడీ కూడా జూన్ 3తో ముగియనుంది.ఈ నేపథ్యంలో కవితతో పాటు మరికొందరిని సోమవారం రోస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. మరోవైపు, మద్యం కుంభకోణంలో బెయిల్ మంజూరు చేయాలంటూ కవిత దాఖలు చేసిన పిటిషన్లపై వాదనలు ముగించిన ఢిల్లీ హైకోర్టు తీర్పును రిజర్వ్‌లో ఉంచింది.