Site icon HashtagU Telugu

Kavitha : కవితకు మరోసారి నిరాశ..బెయిల్‌ నిరాకరించిన కోర్టు

Kavita is once again disappointed..the court denied bail

Kavita is once again disappointed..the court denied bail

Brs Mlc Kavitha: బీఆర్‌ఎస్‌ ఎమ్మేల్సీ కవితకు ఢీల్లీ మద్యం పాలసీ కేసు(Delhi Liquor Policy Case)లో మరోసారి నిరాశే ఎదురైంది. బెయిల్(Bail) కోసం కవిత దాఖలు చేసుకున్న రెండు పిటిషన్ల (petitions)ను ఢిల్లీ రౌస్‌ ఎవెన్యూ కోర్టు కొట్టేసింది(Rejected). ఈడీ, సీబీఐ రెండు కేసుల్లో కవిత బెయిల్ పిటిషన్లను తిరస్కరించారు జడ్జి కావేరి బవేజా. లిక్కర్ పాలసీ కేసులో కవిత కింగ్ పిన్‌గా పేర్కొన్న దర్యాప్తు సంస్థల వాదనను పరిగణనలోకి తీసుకున్న కోర్టు… కవిత బయటకు వస్తే కేసు దర్యాప్తు ప్రభావితం అవుతుందని, ఆధారాలు, సాక్షాలను కవిత తారుమారు చేసే అవకాశం ఉందని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.

We’re now on WhatsApp. Click to Join.

గతంలో కేసుకు సంబంధించిన ఆధారాలు ధ్వసం చేసారని, మొబైల్ డేటా డిలీట్ చేసారని, సాక్షులను బెదిరించారన్న ఈడీ, వాదనను పరిగణలోకి తీసుకున్న కోర్టు.. కవితకు బెయిల్‌ మంజూరు చేయలేదు. అయితే.. కేసులో కవితకు వ్యతిరేకంగా నేరుగా ఎటువంటి ఆధారాలు లేనందున, ఆరోగ్య కారణాలు దృష్టిలో ఉంచుకుని బెయిల్ ఇవ్వాలన్న కవిత వాదనలను కోర్ట్ పరిగణలోకి తీసుకోలేదు. అయితే… రౌస్ అవెన్యూ కోర్ట్ ఇచ్చిన తీర్పుపై హైకోర్ట్‌ను ఆశ్రయించే యోచనలో కవిత తరపు న్యాయవాదులు ఉన్నట్టు తెలుస్తుంది.

Read Also: Dhanush : మాస్క్ లేకుండా చెత్తలో 10 గంటలు.. కుబేర కోసం ధనుష్ డెడికేషన్ లెవెల్ ఇది..!

ఢిల్లీ లిక్కర్ పాలసీలో మార్చి 15న ఈడీ కవితను అరెస్ట్ చేయగా.. ఇదే కేసులో ఏప్రిల్ 11న సీబీఐ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైలులో ఉన్న కవిత.. తుది తీర్పు వరకూ జైలులోనే ఉండనున్నారు.