Kashmir : అందమైన మంచుతో, ప్రశాంతమైన కొండలతో ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షించే ప్రాంతం. కానీ తాజాగా జరిగిన పరిశోధనల ప్రకారం.. ఈ శాశ్వత మంచు (Snow) నానాటికీ కరిగిపోతూ ప్రమాదంలో పడుతోంది. గ్లోబల్ వార్మింగ్ కారణంగా హిమాలయాల్లో శాశ్వతంగా ఉన్న మంచు క్షీణిస్తోంది. ఇది కేవలం కాశ్మీర్ సౌందర్యాన్ని మాత్రమే కాకుండా, అక్కడి జీవన విధానాన్ని, మౌలిక సదుపాయాలను కూడా ప్రమాదంలోకి నెట్టేస్తోంది. జమ్మూ-కాశ్మీర్, లడఖ్ ప్రాంతాల్లో భూగర్భ ఉష్ణోగ్రతలు (Temperatures)పెరుగుతున్నాయి. మంచు కరిగిపోవడంతో అక్కడి రహదారులు, భవనాలు, వంతెనలు కుంగిపోయే ప్రమాదం ఉంది. శాశ్వత మంచు కరిగిపోవడం వల్ల, కార్బన్ వంటి కాలుష్యకర గ్యాసులు వాతావరణంలోకి విడుదలవుతున్నాయి. ఇది పర్యావరణ సమతుల్యాన్ని మరింత దెబ్బతీస్తుంది. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, అభివృద్ధి పనులు, వనరుల వినియోగ మార్పులు, అడవుల తగ్గింపు ఈ సమస్యను మరింత తీవ్రతరం చేస్తున్నాయి.
Telangana Assembly : కేసీఆర్ ఫ్యామిలీ కి భయం ఏంటో చూపించిన సీఎం రేవంత్
ఇప్పటికే లడఖ్‌లోని కొన్ని ప్రాంతాల్లో భూమి కుంగిపోవడం, నదుల ప్రవాహ మార్పులు, హిమానీనదాలు కరిగిపోవడం స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా మిలిటరీ రహదారులు, ప్రాముఖ్యత గల సైనిక మౌలిక సదుపాయాలు ఈ ప్రభావానికి గురయ్యే ప్రమాదం ఉంది. శాశ్వత మంచు క్షీణత వల్ల, గ్లేషియల్ సరస్సుల విస్ఫోటనం (GLOF) పెరుగుతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. గతంలో ఉత్తరాఖండ్‌లో, సిక్కింలో జరిగిన ప్రకృతి విపత్తులు భవిష్యత్తులో కాశ్మీర్, లడఖ్ ప్రాంతాల్లోనూ సంభవించే అవకాశాన్ని సూచిస్తున్నాయి.
UP : రోడ్లపై నమాజ్ చేస్తే పాస్‌పోర్ట్, లైసెన్స్ రద్దు: యూపీ పోలీసులు
ఈ సమస్యను తక్షణమే పరిష్కరించడానికి భూ ఉపరితల ఉష్ణోగ్రతలను నిరంతరం పర్యవేక్షించడం అవసరం. ఉపగ్రహ డేటాతో పాటు, ప్రత్యక్ష పరిశీలనకు అవసరమైన ‘డేటా లాగర్స్’ను మోహరించాలి. అలాగే, భూగర్భ మార్పులను సమర్థంగా అంచనా వేసే విధంగా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి. మౌలిక సదుపాయాల ప్రణాళికలో శాశ్వత మంచు ప్రభావాన్ని లెక్కచేయడం, పర్యావరణ పరిరక్షణకు తగిన చర్యలు చేపట్టడం ఈ ప్రాంత భవిష్యత్తును రక్షించడానికి కీలకం.