KARNATAKA ELECTION RESULT : ఓట్ల కౌంటింగ్ స్టార్ట్.. తీవ్ర ఉత్కంఠ

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్ (karnataka election result) ఇవాళ తెలిసిపోతుంది. రాష్ట్రంలోని మొత్తం 34 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్, ఓట్ ఫ్రమ్ హోమ్ ఓట్లను లెక్కిస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ నెలకొంది.

Published By: HashtagU Telugu Desk
Karnataka Election Result

Karnataka Election Result

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్ (karnataka election result) ఇవాళ తెలిసిపోతుంది. రాష్ట్రంలోని మొత్తం 34 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్, ఓట్ ఫ్రమ్ హోమ్ ఓట్లను లెక్కిస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ నెలకొంది. వీటి కౌంటింగ్ ముగిశాక.. ఈవీఎంలలో ఉన్న ఓట్లను లెక్కించనున్నారు. మధ్యాహ్నం వరకు తుది ఫలితాలు(karnataka election result) వచ్చేస్తాయి.

also read : Karnataka Politics: క్యాంప్ పాలిటిక్స్ షురూ.. కాంగ్రెస్ అభ్యర్థులు హైఅలర్ట్!

బెంగళూరులో 144 సెక్షన్

ఈ ఎన్నికల రిజల్ట్ పై దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈరోజు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు 144 సెక్షన్ విధించారు. కర్ణాటకలో మొత్తం అసెంబ్లీ స్థానాలు 224 కాగా 113 స్థానాలు గెలిచిన పార్టీ అధికారం చేపడుతుంది. బీజేపీ , కాంగ్రెస్ మధ్య తీవ్ర పోటీ ఉంటుందని ఎగ్జిట్ పోల్ ఫలితాలను బట్టి తెలుస్తోంది. ఒకవేళ హంగ్ వస్తే మాజీ ప్రధాని దేవెగౌడకు చెందిన జేడీఎస్ పార్టీ కీలకంగా మారనుంది.

  Last Updated: 13 May 2023, 10:46 AM IST