Karnataka Government : సీఎం, డిప్యూటీ సీఎంలుగా సిద్ధరామయ్య, డీకే ప్రమాణం

కర్ణాటకలో కాంగ్రెస్ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం (Karnataka Government) కొలువు తీరింది.

  • Written By:
  • Updated On - May 20, 2023 / 01:40 PM IST

కర్ణాటకలో కాంగ్రెస్ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం (Karnataka Government) కొలువు తీరింది. సీఎంగా సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ లతో గవర్నర్‌ తావర్‌చంద్‌ గెహ్లాట్‌ ప్రమాణస్వీకారం(Karnataka Government) చేయించారు. రాష్ట్ర 24వ ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య బాధ్యతలు చేపట్టారు. 8 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమం బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో ఘనంగా జరిగింది.

also read : Karnataka: సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారోత్సవానికి 20 పార్టీలను ఆహ్వానించిన కాంగ్రెస్.. బిఆర్ఎస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలకు అందని ఆహ్వానం..!

మంత్రులుగా ప్రమాణం చేసిన వారిలో జి. పరమేశ్వర్ (ఎస్సీ), కేహెచ్ మునియప్ప (ఎస్సీ), కేజే జార్జ్ (మైనార్టీ – క్రిస్టియన్), ఎంబీ పాటిల్ (లింగాయత్), సతీష్ జార్కిహోళి (ఎస్టీ – వాల్మీకి), ప్రియాంక్ ఖర్గే (ఎస్సీ), రామలింగారెడ్డి (రెడ్డి), జమీర్ అహ్మద్ ఖాన్ (మైనార్టీ – ముస్లిం) ఉన్నారు. ఈ కార్యక్రమానికి తమిళనాడు సీఎం స్టాలిన్, బీహార్ సీఎం నితీష్ కుమార్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌, ప్రముఖ నటుడు కమల్‌హాసన్,  ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ  హాజరయ్యారు.