Site icon HashtagU Telugu

DK Sivakumar : డీకే శివకుమార్‌కి కమలా హారిస్ ఆహ్వానం..!

Kamala Harris invites DK Shivakumar..!

Kamala Harris invites DK Shivakumar..!

Kamala Harris invites DK Sivakumar: అమెరికా డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ నుంచి కర్ణాటక ఉపముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత డీకే శివకుమార్‌(DK Sivakumar)కి ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది. ఈ రోజు రాత్రి ఆయన అమెరికా వెళ్లనున్నట్లు అక్కడ కమలా హారిస్‌తో భేటీ కానున్నట్లు సమాచారం. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాతో కూడా భేటీ కానున్నట్లు తెలుస్తోంది.

కమలా హారిస్‌తో వ్యక్తిగతంగా డీకే చర్చలు..

ఈ సమావేశాల ఖచ్చితమైన ఎజెండా ఏమిటో తెలియనప్పటికీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అమెరికాలో ఉన్న సమయంలోనే శివకుమార్ కూడా అక్కడికి వెళ్తుండటం గమనార్హం. న్యూయార్క్‌లో ఆయన కమలా హారిస్‌తో వ్యక్తిగతంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. బరాక్ ఒబామాతో కూడా వన్ వన్ మీటింగ్ ప్లాన్ చేస్తున్నారు. శివకుమార్‌కి కమలా హారిస్‌తో పాటు డెమొక్రాటిక్ నేతల నుంచి ఆహ్వానం అందినట్లు సమాచారం. కమలా హారిస్ కొన్ని నెలల నుంచి డీకే శివకుమార్‌తో సంప్రదింపులు జరుగుతున్నారనే ఆసక్తికరమైన వార్త వినిపిస్తోంది.

మరోవైపు సెప్టెబర్ 10న రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌, వచ్చే ఎన్నికల్లో ప్రెసిడెన్షియల్ అభ్యర్థి, ప్రస్తుత వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ మధ్య డిబేట్ జరగబోతోంది. మరోవైపు రెండు రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం రాత్రి అమెరికా పర్యటనకు బయలుదేరారు. ఈ పర్యటనలో రాహుల్ గాంధీ ప్రవాస భారతీయులతో, విద్యా, వ్యాపారవేత్తలో సమావేశం కానున్నారు.

Read Also: Dark Circles : కలబందలో ఈ మూడింటిని కలిపి రాసుకుంటే డార్క్‌ సర్కిల్స్‌ మాయం..!