Site icon HashtagU Telugu

Kacha Badam Video: ఎవరీ ‘కచ్చా బాదం’.. ఎందుకంత ఫేమస్!

Kacha Badam

Kacha Badam

సోషల్ మీడియా రాకతో సామాన్యులు సైతం సెలబ్రిటీగా మారిపోతున్నారు. రాత్రికి రాత్రే స్టార్స్ హోదాను దక్కించుకుంటున్నారు. ఏదైనా విభిన్నంగా, వినూత్నంగా ప్రయత్నిస్తే.. ఎక్కడా లేని ఫేమ్ ను సొంతం చేసుకోవచ్చు. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ ‘కచ్చా బాదం’.. అసలు ఈ కచ్చా బాదం ఏంటి? ఎందుకంత సంచలనమో తెలుసుకోవాల్సిందే..

బెంగాల్ లోని బీర్భూమ్‌లోని మారుమూల గ్రామంలో నిరుపేద వ్యక్తి భుబన్. వయసు 50పైనే ఉంటుంది. పల్లీలు అమ్మడం ద్వారా వచ్చే ఆదాయంతో పది మంది ఉన్న కుటుంబాన్ని పోషించేందుకు ఎన్నో ఇబ్బందులు పడేవాడు. పొట్ట కూటీ కోసం ఓ టూవీలర్ వెహికల్ పై గల్లీగల్లీ తిరుగుతూ పల్లీలు అమ్ముతుండేవాడు. ఇంట్లో పాత ఇనుము సామాను, ఇతర సామాన్లను తీసుకొని వేరుశనగ అమ్మేవాడు. అయితే తన వ్యాపారం సాఫీగా సాగడం లేదనుకున్నాడమో.. ఏమోకానీ బాదం.. బాదం బదులు.. దానికి సరాదాగా ట్యూన్ కట్టి ఓ పాట పాడి అమ్మేవాడు. ‘బాదం.. బాదం.. కచ్చా బాదం’ అంటూ తనదైన స్టయిల్ లో బాణీలు కట్టి మైమరిపించేలా పాడాడు. అయితే భుబన్ గొంతు డిఫరెంట్ గా ఉండటం. వెరైటీగా పాడటంతో పాట ఎంతోమందిని ఆకట్టుకుంది.

ఓ వ్యక్తి ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గా మారింది. వేలకొద్దీ లైకులు, షేర్స్ పడ్డాయి. ఇక అప్పట్నుంచీ భుబన్ ఒక్కసారిగా సెలబ్రిటీగా మారిపోయాడు. అయితే ఓ మ్యూజిక్ కంపెనీ అతని పాటకు ఫిదా అయి, 1.5 లక్షల చెక్కును అందజేసింది. సౌరవ్ గంగూలీ తప్ప మరెవరూ హోస్ట్ చేయని బెంగాల్‌లోని అత్యంత ప్రజాదరణ పొందిన టెలివిజన్ రియాలిటీ షోలలో భుబన్ కూడా కనిపించాడు! గత శుక్రవారం రాత్రి కోల్‌కతాలోని  నైట్‌క్లబ్‌లో భూబాన్ ప్రదర్శన అక్కడున్నవాళ్లను ఆకట్టుకుంది. భుబన్ ఒక్కసారిగా ఫేమ్ కావడంతో పల్లీలు అమ్మడానికి ఇష్టపడటం లేదు. “నన్ను ఎవరైనా కిడ్నాప్ చేస్తారని, బయటికి వెళ్లవద్దని నా పొరుగువారు నన్ను చెప్పారని నవ్వుతూ సమాధానమిచ్చాడు.

https://youtu.be/58CNG2IBnvw

Exit mobile version