Site icon HashtagU Telugu

Lord Shiva-Parvati: మరో దుమారం.. శివుడు, పార్వతిల స్మోకింగ్ ఫొటో వైరల్!

Lord Shiva

Lord Shiva

ఇండియాకు చెందిన టాంజనీయాలో సెటిల్ అయ్యింది లీనా ఫిల్మ్ మేకర్. ఈమె మణిమేకలై చిత్రం కాళీ పోస్టర్‌ దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. కాళీక దేవి సిగరేట్ తాగుతున్నట్టు పోస్టర్ ను రిలీజ్ చేయడంతో వివాదం మొదలయ్యింది. ఆ పోస్టర్ వివాదం మరిచపోకముందే, తాజాగా మరో పోస్టర్ వైరల్ గా మారింది. శివుడు-పార్వతి వేషధారణలో ఉన్న పురుషుడు, స్త్రీ ‘పొగ తాగుతున్న’ ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది. ఫిల్మ్ మేకర్ లీనా స్వయంగా ట్విటర్‌లో “ఇంకెక్కడా….” అనే క్యాప్షన్‌తో షేర్ చేసింది. మతపరమైన మనోభావాలను దెబ్బతీసినందుకు నెటిజన్లు లీనాపై మండిపడుతున్నారు.

కాగా తమిళనాడులోని కన్యాకుమారిలో శివుడు ‘సిగరెట్ వెలిగిస్తున్నట్లు’ చూపే మరో పోస్టర్ కూడా వివాదస్పదంగా మారింది. పెళ్లి చేసుకున్న ఓ స్నేహితుడికి శుభాకాంక్షలు తెలియజేయడానికి కొంతమంది ఈ పోస్టర్‌ను ఏర్పాటు చేశారట. లీనా మణిమేకలై తన చిత్రం కాళి పోస్టర్ కాళీ దేవి ధూమపానం చేస్తూ, LGBTQ జెండాను పట్టుకున్న ఫొటో పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం కావడంతో దేశవ్యాప్తంగా అనేక పోలీస్ ఫిర్యాదులు నమోదయ్యాయి. ‘అరెస్ట్ లీనా మణిమేకలై’ ట్విట్టర్‌లో కూడా ట్రెండింగ్‌లో ఉంది. మైక్రో బ్లాగింగ్ సైట్ లీనా ట్వీట్ పోస్టర్‌ను తీసివేసింది. ఫిల్మ్ మేకర్ లీనా మాత్రం ఈవేమీ పట్టించుకోకుండా తాను బతికి ఉన్నంత వరకు నిర్భయంగా తన వాయిస్‌ని వినిపిస్తానని తేల్చి చెప్పింది.