Site icon HashtagU Telugu

KA Paul In Turkey: టర్కీలో కేఏ పాల్.. మిస్సైళ్లు, డ్రోన్లపై సంచలన కామెంట్స్

Ka Paul In Turkey India Pakistan Tensions Andhra Pradesh  

KA Paul In Turkey:  భారత్ – పాకిస్తాన్ సైనిక ఘర్షణలపై ఇటీవలే సంచలన కామెంట్స్ చేసిన ప్ర‌జాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ టర్కీలో ప్రత్యక్షమయ్యారు. అక్కడ మ‌హ‌దీ అనే వ్య‌క్తితో క‌లిసి ఓ వీడియోను ఆయన రిలీజ్ చేశారు. ఈ వీడియోలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై కేఏ పాల్ ఫైర్ అయ్యారు. ‘‘పాకిస్తాన్‌కు ట‌ర్కీ మిస్సైల్స్, డ్రోన్లు అమ్మిన  మాట నిజమేనని నాకు ఇక్కడి వాళ్లు చెప్పారు. పాకిస్తాన్‌కు మిస్సైల్స్, డ్రోన్లు వెళ్లకుండా ఆపేందుకే నేను టర్కీకి వచ్చాను. అయితే ఇప్పటివరకు పాకిస్తాన్‌కు అమెరికా మిస్సైల్స్, డ్రోన్లు అమ్మ‌లేదా ?’’ అని ఆయన ప్ర‌శ్నించారు. ‘‘ట్రంప్ ఇప్పుడు సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లారు. ఆ దేశానికి ట్రిలియన్ డాలర్లు విలువైన ఆయుధాలను అమ్మడమే ట్రంప్ టార్గెట్. ఆయుధాలను అమ్మడం, యుద్ధాలను క్రియేట్ చేయడం సరికాదు. ప్రపంచంలో శాంతి రావాలంటే యుద్ధాలు ఆగాలి. ఆయుధాలు విక్రయాలు తగ్గాలి’’ అని  కేఏ పాల్ వ్యాఖ్యానించారు.

ప్రభుత్వాలపై ప్రజలు ఒత్తిడిని పెంచాలి

‘‘పశ్చిమాసియా దేశాల్లో జరిగిన యుద్ధాల్లో ఇప్పటివరకు లక్షలాది మంది అమాయ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. భారత్, పాకిస్తాన్ యుద్ధాల్లోనూ ఎంతోమంది చనిపోయారు. ప్రజలు, సైనికుల ప్రాణాలు చాలా విలువైనవి. వాళ్ల ప్రాణాలతో ప్రభుత్వాలు చెలగాటం ఆడకూడదు. ప్రజలు కూడా ఈ దిశగా ప్రభుత్వాలపై ఒత్తిడిని పెంచాలి’’ అని ఆయన హితబోధ చేశారు. ‘‘భవిష్యత్తులో ప్రపంచంలో న్యూక్లియ‌ర్ వార్ జరిగితే.. ల‌క్షలు కోట్ల మంది చ‌నిపోతారు. ర‌ష్యా ఉక్రెయిన్ యుద్దం టైంలోనూ నేను అక్కడికి వెళ్లాను. యుద్ధం ఆపాలని కోరాను. ఈ ప్రపంచానికి యుద్దాల‌ను మొద‌లుపెట్టే నాయకత్వం అక్కర్లేదు. యుద్ధాలను ఆపే నాయకత్వం కావాలి’’ అని కేఏ పాల్(KA Paul In Turkey) తెలిపారు.

Also Read :Jaishankars Security: జైశంకర్‌కు బుల్లెట్‌ ప్రూఫ్‌ కారు.. 25 మంది నేతలకు భద్రత పెంపు

మే 11న ముంబైలో కేఏ పాల్..  ఏమైందంటే.. 

మే 11న ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్‌‌ టీమ్‌ను విమానం ఎక్కకుండా ముంబై ఎయిర్‌పోర్టులో ఇండిగో ఎయిర్‌లైన్స్ సిబ్బంది అడ్డుకున్నారు. దీనిపై ఆరోజు కేఏ పాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండిగో ఎయిర్‌లైన్స్ సీఈఓ, సంబంధిత సిబ్బందిపై ముంబైలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. శాంతి చర్చల కోసం తాను టర్కీకి వెళ్తుంటే విమానం ఎక్కనివ్వలేదని ధ్వజమెత్తారు. ‘‘నేను 37 ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ప్రయాణాలు చేస్తున్నానున. తాజాగా భారత్- పాక్ ఉద్రిక్తతల గురించి ట్రంప్, అమెరికా సెనేటర్లతో కూడా ఫోన్‌లో మాట్లాడాను. ఇప్పుడు టర్కీకి వెళ్తుంటే అడ్డుకున్నారు’’ అని కేఏ పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read :Earthquakes : 8 దేశాల్లో భూకంపం.. గ్రీస్‌ నుంచి జోర్డాన్‌ దాకా భూప్రకంపనలు