Site icon HashtagU Telugu

Jupiter: భూమికి అతి దగ్గరగా వస్తున్న గురు గ్రహం.. విపత్తులు ఏవైనా జరగనున్నాయా?

Jupiter

Jupiter

ఆకాశంలో అద్భుతం జరగబోతోంది. 70 ఏళ్లలో మొదటిసారిగా గురుగ్రహం భూమికి దగ్గరగా రాబోతుంది. ఈనెల 26వ తేదీన అనగా 2022 సెప్టెంబర్ 26న ఇది జరగనుంది. కాగా గురు గ్రహం భూమికి 58 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అయితే సాధారణంగా ఈ దూరం 59.2 కోట్ల కిలోమీటర్ల దూరం ఉంటుంది. సూర్య కుటుంబం లో ఉన్న ఎనిమిది గ్రహాలలో అతి పెద్దది గురుగ్రహం. ఈ గురుగ్రహం ఎంత పెద్దదిగా ఉంటుంది అంటే దీని లోపల 1300 వందల భూములను నింపవచ్చు అంటే అది అంత పెద్దదిగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

ప్రస్తుతం గురు గ్రహం ఆకాశంలో ప్రతిరోజు ఒక నక్షత్రంలో మెరుస్తూ కనిపిస్తోంది. కానీ సెప్టెంబర్ 26వ తేదీన అది మరింత పెద్దదిగా ప్రకాశవంతంగా కనిపించనుంది.అయితే ప్రతి 13 నెలలకు ఒకసారి జూపిటర్ భూమికి దగ్గరగా వస్తూ ఉంటుంది. కానీ 70 ఏళ్లలో ఇప్పుడు లేని విధంగా మరింత దగ్గరగా వస్తోంది అని నాసా సంస్థ తెలిపింది. దీనిని ఎలా కనిపెట్టాలి అన్న విషయానికి వస్తే.. 26వ తేదీన సూర్యాస్తమయం తరువాత చందమామ కాకుండా మిగతా అన్నింటికంటే ఎక్కువ కాంతివంతంగా కనిపిస్తుంది. ఈ గురు గ్రహాన్ని తూర్పున కనిపెట్టవచ్చు. గ్రహం మాదిరి కాకుండా నక్షత్రంలో మెరుస్తూ రాత్రి మొత్తం కనిపిస్తుంది.

అయితే గురు గ్రహానికి మధ్యలో రెడ్ స్పాట్ ఉంటుంది.
ఇది ఒక సుడిగుండంలా ఉండి భూమి అంటే పెద్దదిగా ఉంటుంది. ఇది 150 ఏళ్లుగా తిరుగుతూనే ఉంది. ఇక జూపిటర్ భూమికి దగ్గరగా వస్తే ఏమైనా ప్రమాదం ఉందా అంటే లేదు అని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఆ విషయంలో ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు అని చెబుతున్నారు. భూమికి ప్రభావితం చేసే అంత దగ్గరగా గురుగ్రహం రాలేదు అని శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే ఈ నెల 26వ తేదీన ఇది కనుక మిస్ అయితే మళ్ళీ 13 నెలల వరకు ఆగాల్సిందే.

Exit mobile version