Site icon HashtagU Telugu

#JOMO Is Trending On Social Media : అసలు JOMO అంటే ఏంటి..?

Jomo

Jomo

జోమో (JOMO) ప్రస్తుతం సోషల్ మీడియా లో టాప్ ట్రేండింగ్ లో కొనసాగుతుంది. అసలు జోమో (JOMO) అంటే ఏంటి..? ఎందుకు ఇది ట్రెండ్ అవుతుంది..? దీనివల్ల ఎవరికీ ఉపయోగం..? దీనిని ఎవరు కనిపెట్టారు..? దీనికి మనిషి కి సంబంధం ఏంటి..? అనేది చూద్దాం.

ప్రస్తుతం స్మార్ట్ యోగం నడుస్తుంది..ఒకప్పుడు ఒకరి సమాచారం ఒకరు తెలుసుకోవాలంటే లెటర్ల ద్వారా తెలుసుకునేవాళ్ళం కానీ ఇప్పుడు సెకన్లలలో ఫోన్ల ద్వారా తెలుసుకుంటున్నాం. సమాచారం తెలుసుకొనే దగ్గరి నుండి మొదలైన ఫోన్..ఇప్పుడు మనిషిలో ఒక భాగం అయ్యింది. సమాచారం తెలుసుకోవడం దగ్గరి నుండి చూసుకునే వరకు అన్ని ఫోన్లలోనే చేస్తున్నాం. మాటలు , పాటలు , వీడియోలు ఇలా ఏదైనా సరే అన్ని ఫోన్లతోనే నడుస్తున్నాయి. దీంతో మనిషి .మనిషికి సంబంధం లేకుండా అయిపోయింది. దూరపు బంధువులనే కాదు పక్కంటి వారితో కూడా ఫోన్ లలోనే పలకరింపులు , చూసుకోవడం చేస్తున్నాం. ఫంక్షన్ లకు సైతం వెళ్లకుండా ఫోన్ లలోనే విషెష్ చెప్పడం..గిఫ్ట్ లు వంటివి కొరియర్ చేయడం వంటివి చేస్తూ ఆలా కూడా దూరం అవుతున్నాం. అంతే కాదు ఇంట్లో నలుగురు ఉంటె ఆ నలుగురు కూడా మనస్ఫూర్తిగా మాట్లాడుకోలేకపోతున్నారు. అంత బిజీ గా ఫోన్ తోనే గడిపేస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఉదయం లేచినదగ్గరి నుండి అర్ధరాత్రి పాడుకునేవరకు అందరం ఫోన్లతోనే గడిపేస్తున్నాం. దీంతో మనం ఎంత అందమైన లైఫ్ ను మిస్ చేసుకుంటున్నామో తెలియడం లేదు. ఒకప్పుడు ఆరుబయట కానీ ..పిట్టగోడలపై కానీ సరదాగా మాట్లాడుకుంటూ..నవ్వుకుంటూ..బాధలు పంచుకుంటూ ఎంతో హ్యాపీగా ఉన్నాం..కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు ఫోన్లలలోనే ఉండడం తో అన్ని మిస్ అవుతున్నాం.

ఇదే విషయాన్నీ జోమో (JOMO) చెపుతుంది. జోమో (JOMO) అంటే.. జాయ్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ (Joy of Missing Out) అని అర్థం. సోషల్‌మీడియాకు బానిసైపోయి మీరు మీ ఫోన్ తో టైం గడుపుతున్నపుడు మీరు మిస్ అవుతున్న ఆనందాలనే జొమో అంటారు. ప్రస్తుతం ఈ #JOMO హ్యాష్‌ట్యాగ్‌ విపరీతంగా ట్రెండ్‌ అవుతోంది. టిక్‌టాక్‌లో #JOMO హ్యాష్‌ట్యాగ్‌కు 53 మిలియన్‌ వ్యూస్‌ వచ్చాయని ఫోర్బ్స్‌ చెబుతోంది.

ముందుగా ఈ పదాన్ని 2012లో ఓ పారిశ్రామిక వేత్త వాడినట్లు తెలుస్తోంది. తను సోషల్ మీడియా మాయలో పడి.. ఎన్ని మానవ సంబంధాలను కోల్పోయాడో చెప్పుకొచ్చారు. ఈ జాయ్ మిస్సింగ్ ఫీలింగ్ ను జొమో అని.. తన కొడుకు పుట్టిన యేడాదికి తనకి ఈ ఫీలింగ్ కలిగిందని తెలిపాడు. ఇప్పటికైనా ఫోన్ ను కాస్త పక్కకు పెట్టి ఫ్యామిలీ తో మాట్లాడడం..ఫ్రెండ్స్ ను కలవడం..సరదాగా కబుర్లు చెప్పుకోవడం చేయాలనీ కోరుకుంటున్నాం. ఎందుకంటే మనం బ్రతికేది కొంతకాలం..ఈ కొంతకాలాన్ని హ్యాపీ గా గడపకుండా రూమ్ కే పరిమితం కావొద్దని JOMO చెపుతుంది.

Read Also : Ram Darshan Timings: అయోధ్య బాల‌రాముడి దర్శనం వేళల్లో మార్పులు..!