Site icon HashtagU Telugu

Job With 10th : టెన్త్ పాసయ్యారా.. గవర్నమెంట్ జాబ్ మీకోసమే

Job With 10th

Job With 10th

టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళూ ఇక గవర్నమెంట్ ఎంప్లాయీ (Job With 10th) కావచ్చు. స్టార్టింగ్ లోనే ప్రతినెలా 20వేల రూపాయలపైనే  శాలరీని కూడా అందుకోవచ్చు. ఈ జాబ్ కావాలంటే వెంటనే మీరు  https://www.indiapost.gov.in/  వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లై చేయండి. మీకు పోస్టల్ డిపార్ట్మెంట్ లో మంచి జాబ్ వస్తుంది. గ్రామీణ్ డాక్ సేవక్ (GDS) పోస్టుల పరిధిలోని బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (ABPM) జాబ్స్ ను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా 12828 BPM, ABPM పోస్టులను భర్తీ చేయాలని ఇండియా పోస్ట్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ  జాబ్ కు అప్లై చేయడానికి  లాస్ట్ డేట్ జూన్ 11. అప్లికేషన్ ఫామ్ లో కరెక్షన్స్ చేసుకోవడానికి విండో జూన్ 12 నుంచి జూన్ 14 వరకు తెరిచి ఉంటుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఈ జాబ్ కు అప్లై చేసే వారి వయసు కనీసం 18 సంవత్సరాల నుంచి గరిష్టంగా 40 సంవత్సరాలలోపు ఉండాలి. అయితే పలు సామాజిక వర్గాలకు ఇందులో సడలింపు ఉంటుంది. నోటిఫికేషన్ కాపీలో ఏ వివరాలు లభిస్తాయి. 10వ తరగతి వార్షిక పరీక్షలోవచ్చిన మార్కులు, రిజర్వేషన్ల ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌ లిస్ట్ చేస్తారు.  BPM పోస్ట్ కు సెలెక్ట్ అయ్యేవారికి రూ.12,000 నుంచి రూ.29,380 దాకా జీతం ఇస్తారు. ABPMగా సెలెక్ట్ అయ్యే వారికి రూ.10,000 నుంచి రూ. 24,470 దాకా శాలరీ (Job With 10th) ఇస్తారు.

also read : Jobs: టాప్ 10 డిజిటల్ మార్కెటింగ్ ఉద్యోగాలు.. లక్షల్లో శాలరీలు

ఎలా దరఖాస్తు చేయాలి ?

స్టెప్  1: ఇండియా పోస్ట్  అధికారిక వెబ్‌సైట్‌ను తెరవండి. https://www.indiapost.gov.in/

స్టెప్ 2: వెబ్‌సైట్‌ హోమ్ పేజీలోని  జాబ్ రిక్రూట్‌మెంట్ సెక్షన్  పై క్లిక్ చేయండి.

స్టెప్ 3: పేరు, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ వంటి  ప్రాథమిక సమాచారాన్ని నమోదు చేయండి.

స్టెప్ 4: అడిగిన వివరాలను నమోదు చేసి .. దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి.

స్టెప్ 5: అవసరమైన డాక్యుమెంట్స్ ను అప్‌లోడ్ చేయండి.

స్టెప్ 6: దరఖాస్తు రుసుము చెల్లించండి.

స్టెప్ 7: దరఖాస్తు ఫారమ్‌ను సబ్మిట్ చేసి..  డౌన్‌లోడ్ చేసుకోండి.

also read : Artificial Intelligence: అసలుకు ఎసరు – AI మింగేసే జాబ్స్ ఇవే..

అప్లికేషన్ ఫీజు

BPM, ABPM రెండు పోస్టులకూ అప్లికేషన్ ఫీజు రూ. 100. మహిళా అభ్యర్థులు, SC/ST దరఖాస్తుదారులు, PWD దరఖాస్తుదారులు, లింగమార్పిడి దరఖాస్తుదారులు అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. దరఖాస్తు ఫారమ్ కోసం నమోదు చేసుకునేటప్పుడు అభ్యర్థి మొబైల్ నంబర్, ఈమెయిల్ IDని అందించాలి.  ఎందుకంటే ఇది ఏదైనా సమాచారాన్ని కమ్యూనికేట్ చేయడానికి సహాయపడుతుంది.