Jio AirFiber : జియో అంటేనే సంచలనం..
మన దేశంలో ఇంటర్నెట్ విప్లవానికి బీజాలు వేసిన సంస్థ ఇది..
సామాన్యులకూ ఇంటర్నెట్ వినియోగం రుచిని చూపించిన టెలికాం దిగ్గజం ఇది..
ఇలాంటి నేపథ్యం కలిగిన జియో మరో సంచలనం సృష్టించడానికి రెడీ అవుతోంది.
అతి త్వరలోనే 5జీ ‘ఎయిర్ ఫైబర్’ పై జియో అనౌన్స్ మెంట్ చేయబోతోంది.
ఆగస్టు 28న (సోమవారం) మధ్యాహ్నం 2 గంటలకు జరగబోయే రిలయన్స్ జియో 46వ వార్షిక సర్వసభ్య సమావేశం (AGM)లో దీనిపై ప్రకటన వెలువడుతుందని అంచనా వేస్తున్నారు.
ఈనేపథ్యంలో దానికి సంబంధించిన పలు వివరాలను తెలుసుకుందాం..
Also read : Aditya L-1 Mission: ఇస్రో నెక్స్ట్ టార్గెట్ సూర్యుడే.. మరో వారం రోజుల్లోనే ఆదిత్య ఎల్-1 ప్రయోగం.. సూర్యుడిపై ఎందుకీ ఈ ప్రయోగం..?
ఆప్టికల్ ఫైబర్ అవసరం లేకుండానే..
డైరెక్ట్ ‘ఎయిర్ ఫైబర్’ అనేది ఒక కొత్త రకం ఇంటర్నెట్ టెక్నాలజీ. ఇందులో ఆప్టికల్ ఫైబర్ అవసరం లేకుండానే ఇంటర్నెట్ ను యూజర్స్ కు అందించే అవకాశం ఉంటుంది. ‘ఎయిర్ ఫైబర్’ కనెక్షన్ లో భాగంగా ఒక రిసీవర్ ను ఇస్తారు. దానిలో 5G SIMని ఇన్ సర్ట్ చేస్తారు. రూటర్ వంటి పరికరాన్ని ఆ రిసీవర్ తో కనెక్ట్ చేసి మనం Wi-Fiని ఎంజాయ్ చేయొచ్చు. ‘ఎయిర్ ఫైబర్’ వినియోగదారులు వైర్ లెస్ గా 1Gbps హై-స్పీడ్ ఇంటర్నెట్ ను పొందే వీలు ఉంటుంది. ‘ఎయిర్ ఫైబర్’ కనెక్షన్ తీసుకునేటప్పుడు ఒకవేళ మీకు కావాలంటే వైర్ కూడా ఇస్తారు. వైర్ లేకుండా కూడా ‘ఎయిర్ ఫైబర్’ రిసీవర్ ను వాడుకోవచ్చు.
Also read : KCR’s Niece: కరీంనగర్ బరిలో కేసీఆర్ మేనకోడలు, కాంగ్రెస్ నుంచి రమ్యరావు పోటీ
ఎయిర్ టెల్ కంటే 20 శాతం తక్కువకే..
‘ఎయిర్ ఫైబర్’ (Jio AirFiber) ఇంటర్నెట్ సేవలను మన దేశంలో ముందుగా ఎయిర్ టెల్ స్టార్ట్ చేసింది. ఇప్పటికే ఢిల్లీ, ముంబైలలో Airtel Xstream AirFiber సేవలు అందుబాటులోకి వచ్చాయి. నెలకు రూ.799 చొప్పున 6 నెలల Airtel Xstream AirFiber ప్లాన్ కు ప్రస్తుతం రూ.4,435 ఛార్జీని తీసుకుంటున్నారు. ఈ కనెక్షన్ కోసం ఎయిర్ టెల్ 2,500 రూపాయల వన్ టైమ్ రీఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ ను వసూలు చేస్తోంది. త్వరలో జియో ఎయిర్‌ఫైబర్ ప్లాన్ ఇంతకంటే 20 శాతం తక్కువ రేటుకే అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. నెలకు రూ.640 సగటు ఛార్జీతో కేవలం రూ. 3650కే జియో ఎయిర్ ఫైబర్ 6 నెలల ప్లాన్ ను ఆఫర్ చేసే ఛాన్స్ ఉందని సమాచారం. ఇందులో JioCinemaతో పాటు అనేక ఇతర యాప్‌ల ఉచిత సభ్యత్వాన్ని కూడా జియో అందించనుంది.