TS : హైకోర్టు ఆదేశాల మేర మళ్లీ తెరుచుకున్న జీవన్‌ రెడ్డి మాల్‌

  • Written By:
  • Publish Date - May 25, 2024 / 01:49 PM IST

Jeevan Reddy Mall: బస్టాండ్‌ సమీపంలో ఆర్టీసీ లీజుకు ఇచ్చిన స్థలంలో నిజామాబాద్‌ జిల్లా ఆర్మూరుకు చెందిన బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి(Jeevan Reddy)మాల్‌( Mall) తమకు బకాయిలు చెల్లించలేదంటూ ఆర్టీసీ ఇటీవల దాన్ని మూసేయించిన విషయం తెలిసిందే. దీంతో జీవన్‌ రెడ్డి కోర్టుకెక్కారు. ఈ క్రమంలోనే మాల్ లోని సబ్ లీజుదారుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని దాన్ని తిరిగి తెరవాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈనేపథ్యంలోనే జీవన్ రెడ్డికి చెందిన షాపింగ్ మాల్, మల్టీప్లెక్స్ మళ్లీ తెరుచుకుంది.

We’re now on WhatsApp. Click to Join.

కాగా, ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్(RTC MD VC Sajjanar) ‘ఎక్స్’ వేదికగా ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. తమ సంస్థకు పెండింగ్‌లో ఉన్న రూ.2.51 కోట్ల అద్దె బకాయిలను వారం రోజుల్లోగా చెల్లించాలని మాల్ యాజమాన్య సంస్థ విష్ణుజిత్ ఇన్ ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ను హైకోర్టు ఆదేశించిందని చెప్పారు. ఒకవేళ గడవులోగా బకాయిలు చెల్లించకపోతే నోటీసు ఇవ్వకుండానే మాల్ ను తిరిగి తాము స్వాధీనం చేసుకోవచ్చని హైకోర్టు ఉత్తర్వుల్లో స్పష్టం చేసిందన్నారు.

Read Also:300 People Buried : 300 మంది సజీవ సమాధి.. కొండ చరియల బీభత్సం 

అందుకే హైకోర్టు ఆదేశాల మేరకు సబ్‌ లీజ్‌ దారులను దృష్టిలో ఉంచుకొని జీవన్ రెడ్డి మాల్ అండ్ మల్టీప్లెక్స్ ను తెరిచేందుకు శుక్రవారం అనుమతి ఇచ్చామని సజ్జనార్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. వారం రోజుల్లోగా అద్దె బకాయిలు చెల్లించకుంటే హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం నడుచుకుంటామని తెలిపారు.