ఒక భార్య ఉంటేనే..ఎందుకు చేసుకున్నాం రా పెళ్లి అని బాధపడే ఈరోజుల్లో..నలుగురు భార్యలు ఉన్నప్పటికీ..సదరు వ్యక్తి ఏ పని చేయకున్నా ..ఏమనుకుంటా..అదికూడా ఒకే ఇంట్లో అందరు కలిసి ఉంటూ..అతడితో పడకసుఖం పంచుకుంటూ వారు హ్యాపీగా ఉండడమే కాకుండా అతడ్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నారంటే..వారు ఎంత మంచి వారో..అతడు ఎంత అదృష్టవంతుడో కదా..!! ఇంతకీ ఆ అదృష్టవంతుడు ఎక్కడ ఉంటాడనే కదా… జపాన్ దేశంలోని హోక్కాయిడో ఐలాండ్ చెందిన వటనాబె స్టోరీనే ఇది. ఇతడు గత 10 ఏళ్లుగా ఎలాంటి ఉద్యోగం చేయకపోయినా ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఆరేళ్ల కిందట వటనాబెకు ఓ గర్ల్ ఫ్రెండ్ ఉండేది. అయితే వటనాబె ఏ పని చేయకపోవడంతో అతడిని విడిచిపెట్టింది.
దీంతో మనస్థాపానికి గురైన అతడు.. తన బాధనంతా ఓ డేటింగ్ యాప్ లో చెప్పుకున్నాడు. మనోడి కథ విన్న కొంత మంది అమ్మాయిలు అతనిపై సింపతి చూపిస్తూ అతడ్ని పెళ్లి చేసుకోవడం మొదలుపెట్టారు. ఇలా ఒకరిద్దరు కాదు నలుగురు చేసుకున్నారు. ఈ నలుగురు కూడా అతనిని ఏ పని చేయనివ్వడం లేదు. ఇంట్లో ఉండి వంట చేస్తూ పిల్లలను చూసుకుంటే చాలు అని చెపుతున్నారు. వారు మాత్రం ఉద్యోగం చేసి సంపాదిస్తున్నారు. అయితే వటనాబె ఇంట్లో ఖర్చు నెలకు రూ. 5 లక్షల వరకు అవుతున్న..ఆ ఖర్చంతా కూడా ఆ భార్యలే చేసుకుంటున్నారట. అంతే కాదు నలుగురు భార్యలకు విడివిడిగా బెడ్ రూంలు ఉన్నాయి. రోటేషన్ పద్దితిలో వారి రూముల్లోకి వెళ్లి కలిసి ఉంటాడు. అయితే ఎవరూ ఎలాంటి ద్వేషాలు లేకుండా వటనాబెను అందరూ సమానంగా పంచుకుంటారు. అయితే వటనాబెకు కొందరు గర్ల్ ప్రెండ్స్ కూడా ఉన్నారు. అ విషయం భార్యలకు తెలిసినా ఏమాత్రం పట్టించుకోరట..ఈ విషయం బయటకు వచ్చిన దగ్గరినుండి అబ్బా అదృష్టం అంటే అతడిదే పో ..అని సాటి మగవారు కుల్లుకుంటున్నారు.
Read Also : BiggBoss 8 : బిగ్ బాస్ 8లో సెల్ఫ్ ఎలిమినేషన్.. రీజన్స్ ఇవేనా..!