Site icon HashtagU Telugu

January 1 Horoscope : జనవరి 1 రాశిఫలాలు.. ఆ రాశివారికి ధన లాభం

January 1 Horoscope

January 1 Horoscope

January 1 Horoscope : హ్యాపీ న్యూ ఇయర్. ఈరోజు మనం కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టాం. ఈసందర్భంగా నూతన ఏడాదిలో మొదటి రోజున రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం.  

We’re now on WhatsApp. Click to Join.

మేష రాశి  

జనవరి 1న ఈ రాశివారికి చాలా అనుకూలమైన రోజు.  అదృష్టం  కలిసొస్తుంది. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారంతో పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి.  వ్యాపార విస్తరణకు కొత్త అవకాశాలు లభిస్తాయి. ప్రేమ, వృత్తి, డబ్బు , ఆరోగ్యం  అన్నీ బావుంటాయి. ఉద్యోగులకు, వ్యాపారాలకు వాతావరణం అనుకూలం.

వృషభ రాశి 

జనవరి 1న ఈ రాశివారికి ఆర్థిక పరిస్థితిలో హెచ్చు తగ్గులు ఉంటాయి.  డబ్బుకు సంబంధించిన నిర్ణయాలు చాలా ఆలోచించి తీసుకుంటారు. బడ్జెట్‌కు అనుగుణంగా ఖర్చులను నిర్ణయించుకోండి . మీ భావాలను మీ భాగస్వామితో పంచుకోవడానికి సంకోచించకండి. మీ భాగస్వామి అభిప్రాయాలను గౌరవించండి. వృత్తి జీవితంలో పురోగతికి కొత్త అవకాశాలు ఉంటాయి. కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటే పురోగతికి తలుపులు(January 1 Horoscope) తెరుచుకుంటాయి.

Also Read: Hangover Foods: హ్యాంగోవర్ తగ్గట్లేదా ? ఇవి తినండి..

మిథున రాశి  

జనవరి 1న ఈ రాశివారు ఏదో తెలియని భయంతో కలత చెందుతారు. అయినా పాజిటివ్‌గా ఉండండి. మీ కలలను నిజం చేసుకోవడానికి కొత్త ప్రయత్నాలు చేయండి. ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేయడానికి కొత్త ప్లాన్స్ రూపొందించండి. ఆర్థిక విషయాలలో తెలివిగా నిర్ణయాలు తీసుకోండి.  ఈరోజు మీరు అదనపు బాధ్యతలను పొందుతారు.

కర్కాటక రాశి   

జనవరి 1న ఈ రాశివారికి వ్యాపారంలో ధనలాభం ఉంటుంది. కార్యాలయంలో అధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది.మీ సామర్థ్యాలపై నమ్మకం ఉంచండి . జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోండి.

సింహ రాశి 

జనవరి 1న ఈ రాశివారు కుటుంబంలో అనవసర వివాదాలకు దూరంగా ఉండాలి. కోపం వద్దు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. వృత్తి జీవితంలో మీరు ఎంతో నమ్మకంగా కనిపిస్తారు. మీరు చేసే పనుల్లో మంచి ఫలితాలు వస్తాయి.

కన్యా రాశి   

జనవరి 1న ఈ రాశివారు ఆఫీసు గాసిప్‌లకు దూరంగా ఉండండి. మీ ప్రతిభను చాటుకోవడంపై ఫోకస్ పెట్టండి. ఇది కెరీర్‌లో వృద్ధికి కొత్త దారులను చూపిస్తుంది. మీ సామాజిక హోదా, ప్రతిష్ట పెరుగుతుంది. పెట్టుబడికి సంబంధించిన నిర్ణయాలను తెలివిగా తీసుకోండి.

తులా రాశి  

జనవరి 1న ఈ రాశివారికి కార్యాలయంలో సవాళ్లు ఉంటాయి. ఉద్యోగంలో మార్పు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీ వాహన నిర్వహణపై ఖర్చులు పెరగొచ్చు. వ్యాపార విస్తరణకు కొత్త అవకాశాలు లభిస్తాయి. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి అవుతాయి.

వృశ్చిక రాశి 

జనవరి 1న ఈ రాశివారికి అధిక ఖర్చుల వల్ల మనస్సు కలత చెందుతుంది. కార్యాలయంలో అనవసర వాదనలకు దూరంగా ఉండండి. బిజీ వర్క్ ఉంటుంది. సవాళ్లను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోండి. ధన ప్రవాహం పెరుగుతుంది.

ధనుస్సు రాశి   

జనవరి 1న ఈ రాశివారి కోపం కారణంగా పూర్తికావాల్సిన పని కూడా ఆగిపోయే ప్రమాదం ఉంటుంది. మీరు ఆత్మవిశ్వాసంతో నిండి ఉంటారు కానీ మీ సహనం తగ్గుతుంది. కుటుంబంలో పరస్పర విభేదాలను సానకూలంగా పరిష్కరించేందుకు ప్రయత్నించాలి. ఈ రోజు మీరు పాత స్నేహితులను కలుసుకోవచ్చు.

మకర రాశి  

జనవరి 1న ఈ రాశివారికి కుటుంబ సమస్యల వల్ల మనస్సు కలత చెందుతుంది. ప్రణాళికేతర ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారం బాగానే ఉంటుంది. డబ్బు ప్రవాహానికి కొత్త మార్గాలు ఏర్పడతాయి. ఉద్యోగులకు ఉన్నతాధికారుల మద్దతు లభిస్తుంది. మీ పిల్లల నుంచి శుభవార్తలు అందుకుంటారు.

కుంభ రాశి   

జనవరి 1న ఈ రాశివారికి పని బాధ్యతలు పెరుగుతాయి. ఉద్యోగంలో మార్పు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొత్త ఆదాయ వనరులు పొందుతారు. పురోగతికి కొత్త అవకాశాలుంటాయి. జీవిత భాగస్వామి ఆరోగ్యం మెరుగుపడుతుంది.

మీన రాశి  

జనవరి 1న ఈ రాశివారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది.ఆస్తులకు సంబంధించి కొనసాగుతున్న వివాదాలు పరిష్కారం అయ్యే సూచనలున్నాయి.

గమనిక: ఈ సమాచారం వివిధ మాధ్యమాలు/జ్యోతిష్యులు/పంచాంగాలు/ఉపన్యాసాలు/నమ్మకాలు/గ్రంధాల నుంచి సేకరించిన తర్వాత మీ ముందుకు తీసుకురాబడింది. మా లక్ష్యం సమాచారాన్ని అందించడం మాత్రమే, దాన్ని వినియోగదారులు కేవలం సమాచారంగా తీసుకోవాలి. 

Exit mobile version