Site icon HashtagU Telugu

Storm : తుపాను బీభత్సవం..ఐదుగురు మృతి..500 మందికి గాయాలు..

Jalpaiguri storm.. 5 killed, 500 injured; Mamata Banerjee rushes to north Bengal

Jalpaiguri storm.. 5 killed, 500 injured; Mamata Banerjee rushes to north Bengal 2

 

Bengal Storm: బంగాల్‌ జల్పాయ్​గుడి జిల్లా(Bengal Jalpaigudi District)లోని పలు ప్రాంతాల్లో ఆదివారం ఆకస్మిక తుపాను( storm) విధ్వంసం సృష్టించింది. తుపాను కారణంగా జరిగిన ప్రమాదాల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. 500 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.

We’re now on WhatsApp. Click to Join.

మైనాగుడీలోనూ అనేక ప్రాంతాల్లో వడగళ్లతో కూడిన వాన బీభత్సం సృష్టించింది. బలమైన గాలులు వీయడం వల్ల అనేక గుడిసెలు, ఇళ్లు దెబ్బతిన్నాయి. అధిక సంఖ్యలో చెట్లు నేలకూలాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. రాజర్‌హట్, బర్నిష్, బకాలీ, జోర్పక్డి, మధబ్దంగా, సప్తిబరి ప్రాంతాల్లో తుపాను తీవ్ర ప్రభావం చూపింది.

ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తుపాను ప్రభావిత ప్రాంతాలను క్షేత్రస్థాయిలో సందర్శించారు. అక్కడ బాధిత కుటుంబాలను పరామర్శించారు. బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

“జిల్లా యంత్రాంగం బాధితులకు అండగా ఉంటుంది. తుపాను కారణంగా ఏ మేర నష్టం జరిగిందో అనేదానిపై ఒక అంచనాకు వచ్చాం. జరిగిన అతిపెద్ద నష్టం ఏంటంటే ప్రాణ నష్టం. తుపానులో గాయపడ్డవారిని సూపర్​ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించాం. వారిని మెరుగైన చికిత్స అందుతుంది. రెస్క్యూ ఆపరేషన్​లో పాల్గొన్న అధికారులకు నా ధన్యవాదాలు. వైద్యులు, నర్సులు నిర్విరామంగా పనిచేస్తున్నారు. సహాయక చర్యలు ఇప్పటికే ముగిశాయి”

Read Also: RBI: ఆర్బీఐకి 90 ఏళ్లు.. ప్రత్యేక రూ. 90 నాణెం విడుదల చేసిన ప్రధాని మోడీ

‘ఇది చాలా దురదృష్టకర ఘటన. తుపాను పరిస్థితులు చూసి తీవ్రంగా ఆందోళన చెందాను. బాధితులకు అవసరమైన వాటన్నింటినీ అందించమని అధికారులను ఆదేశించాను. అన్ని శాఖలు సమన్వయంగా పనిచేస్తున్నాయి. ఇక పరిస్థితులను ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. నేనూ క్షేత్రస్థాయిలో పర్యటిస్తాను. ఆ తర్వాత అవసరమైన చర్యలను తీసుకుంటాం’ అని బంగాల్​ గవర్నర్ సీవీ ఆనంద బోస్​ మీడియాతో చెప్పారు.

మరోవైపు తుపానులో మృతి చెందిన కుటుంబాలకు ప్రధాని మోడీ ఎక్స్ వేదికగా సంతాపం ప్రకటించారు. సహాయక చర్యల్లో పాల్గొనాలని బంగాల్‌లోని బీజేపీ కార్యకర్తలకు సూచించారు.

 

Exit mobile version