Site icon HashtagU Telugu

BRS leaders : అధికారంలో ఉన్నా కుట్రలే.. అధికారం లేకపోయిన కుట్రలే : జగ్గారెడ్డి

Jagga Reddy

Jagga Reddy

Jaggareddy : కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి బీఆర్‌ఎస్‌ నేతలపై విమర్శలు చేశారు. అధికారం కోల్పోయాక బీఆర్ఎస్ నేతలు రాబంధుల్లా రాష్ట్రం పై పడ్డారని కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారంలో ఉన్నా కుట్రలు.. అధికారం కోల్పోయిన తరువాత కూడా బీఆర్ఎస్ నేతలు కుట్రలు చేస్తున్నారని తెలిపారు. బలవంతంగా భూములను లాక్కొనే ఆలోచన ప్రభుత్వానికి లేదన్నారు. ప్రభుత్వం పై కేటీఆర్ బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు.

అంతేకాక..బీఆర్ఎస్ నేతలు గొడవలు సృష్టించి రాష్ట్రనికి పరిశ్రమలు రాకుండా చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి పేర్కొన్నారు. మల్లన్న సాగ్ బాధితులపై జరిగిన లాఠీ చార్జ్ ఫోటోలను జగ్గారెడ్డి చూపించారు. ప్రభుత్వం చేస్తున్న మంచిని చూసి బీఆర్ఎస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. రైతులను రెచ్చగొట్టి అధికారులను కేటీఆర్ కొట్టిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను కొట్టినట్టు ఒక్క ఆధారమైన చూపిస్తారా..? అని ప్రశ్నించారు. లగచర్ల దాడి చేయించి కేటీఆర్ అడ్డంగా దొరికిపోయారని జగ్గారెడ్డి అన్నారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారు. 200 యూనిట్లు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం. ఉచిత బస్సు, రూ.500 గ్యాస్ సిలిండర్, రైతు రుణమాఫీ జరిగింది. రూ.2500 మహిళలకు పింఛన్లు, 4వేల పింఛన్లు, ఇందిరమ్మ ఇండ్లు కూడా త్వరలోనే మంజూరు చేస్తామని జగ్గారెడ్డి తెలిపారు.

Read Also: Narendra Modi : ప్రధాని మోదీకి అత్యున్నత పురస్కారం