ITBP personnel: చైనా బార్డర్ లో ఇండియా సైన్యం “దస్తీ బిస్తీ”!!

"మా తాత ఉత్తరం ఎక్కడో పోయింది" అని అంటూ .. చేతిలో హ్యాండ్ కర్చీప్ పట్టుకొని..

Published By: HashtagU Telugu Desk
Itbp

Itbp

“మా తాత ఉత్తరం ఎక్కడో పోయింది” అని అంటూ .. చేతిలో హ్యాండ్ కర్చీప్ పట్టుకొని.. వలయాకారంలో కూర్చున్న స్నేహితుల చుట్టూ పరుగెత్తుతూ సరదాగా ఆడిన “దస్తీ బిస్తీ” ఆట గుర్తుందా!! ఈ ఆటను హిమాచల్ ప్రదేశ్ లోని చైనా సరిహద్దుల్లో సేవలు అందించే ఇండో టిబెటన్ బార్డర్ పోలీసు (ఐటీబీపీ) సిబ్బంది ఆడారు.

చుట్టూ మంచు, ఎముకలు కొరికే చలి నడుమ విధి నిర్వహణ చేసే ఈ శూరులు ఒక్కసారిగా బాల్యం జ్ఞాపకాల్లోకి వెళ్లారు. అందరూ కలిసి కాసేపు “దస్తీ బిస్తీ” ఆట ఆడారు. దీనికి సంబంధించిన ఒక వీడియోను ఐటీబీపీ అధికారిక ట్విట్టర్ ఖాతా షేర్ చేసింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు కూడా బాల్యం రోజుల జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. “మేం కూడా చిన్నప్పుడు ఈ గేమ్ ను తెగ ఆడేవాళ్ళం” అంటూ కామెంట్స్ పెట్టారు. ఈ వీడియోకు ట్విట్టర్ లో వేలాది వ్యూస్ వచ్చాయి.

  Last Updated: 26 May 2022, 09:46 AM IST