Harvansh Singh Rathore : బీజేపీ మాజీ ఎమ్మెల్యే హర్వాన్ష్ సింగ్ రాథోడ్ పన్ను ఎగవేతకు పాల్పడినట్లు ఆరోపణలొచ్చాయి. దీంతో ఐటీ అధికారులు ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఆ సమయంలో రాథోడ్ ఇంట్లోని చెరువులో మూడు మొసళ్లు కనిపించాయి. దీంతో వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. హర్ష్వాన్ సింగ్ రాథోడ్ రూ.155 కోట్ల పన్ను ఎగవేతకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. రాథోడ్ నివాసంలో రూ.3 కోట్ల నగదుతో పాటు కోట్ల విలువైన బంగారం, వెండి ఆభరణాలను గుర్తించారు.
రాథోడ్‌తో పాటు మాజీ కౌన్సిలర్ రాజేశ్ కేశర్వాణి ఇంట్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. కేశర్వాణి రూ.140 కోట్ల పన్ను ఎగవేతకు పాల్పడిన పత్రాలను అధికారులు గుర్తించారు. ఓ వ్యాపారంలో వీరిరువురూ భాగస్వాములని తేలింది. కేశర్వాణి ఇంట్లో, అధికారులు అనేక బినామీ దిగుమతి చేసుకున్న కార్లను కూడా కనుగొన్నారు. కేశర్వాణి ఆదాయపు పన్ను శాఖ రవాణా శాఖ నుండి కార్లకు సంబంధించిన సమాచారాన్ని కోరింది. వారు ఈ కార్లను ఎలా సంపాదించారనే దానిపై విచారణ జరుపుతున్నారు.
కాగా, సాగర్ జిల్లాలో వ్యాపారవేత్త, సీనియర్ బీజేపీ నాయకుడు అయిన రాథోడ్ 2013 అసెంబ్లీ ఎన్నికలలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. జిల్లా చీఫ్ పదవికి కూడా బలమైన పోటీదారు. ఆయన తండ్రి హర్నామ్ సింగ్ రాథోడ్ మధ్యప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు.
Read Also: Gokulas : భవిష్యత్ లో 20వేల గోకులాలు ఏర్పాటు : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్