Lokesh : అన్యాయం, అవినీతి గురించి జగన్‌ మాట్లాడటం వింతగా ఉంది: లోకేశ్‌

రాష్ట్రంలో బాధితులనే నిందితులుగా చేసిన చీకటి రోజులు పోయి నెల దాటింది. కూటమి ప్రభుత్వం మిగిలిన ఆ అరాచకపు ఆనవాళ్లను కూడా కూకటివేళ్లతో పెకలించేస్తోంది.

  • Written By:
  • Publish Date - July 18, 2024 / 03:05 PM IST

Lokesh: టీడీపీ మంత్రి నారా లోకేశ్‌(Nara Lokesh) మాజీ సీఎం జగన్‌(Jagan)పై మరోసారి విమర్శలు గుప్పించారు. హింస, విధ్వంసం, అరాచకం, అన్యాయం, అవినీతి గురించి జగన్ మాట్లాడటం వింతగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా పోస్టు చేశారు. రాష్ట్రంలో బాధితులనే నిందితులుగా చేసిన చీకటి రోజులు పోయి నెల దాటింది. కూటమి ప్రభుత్వం మిగిలిన ఆ అరాచకపు ఆనవాళ్లను కూడా కూకటివేళ్లతో పెకలించేస్తోంది. ప్రజా తీర్పుతో ఉనికి కోల్పోయిన జగన్ అసత్య ప్రచారాలతో అబద్దపు పునాదులపై మళ్లీ నిలబడాలని చూస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా హత్యా రాజకీయాలంటూ ప్రభుత్వానికి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. శవాలతో రాజకీయాలు చేసే మీ విష సంస్కృతికి ప్రజలు ఇచ్చిన తీర్పే మొన్నటి ఎన్నికల ఫలితాలు అని ఇంకా అర్థం చేసుకోకపోతే ఎలా? నేరాలు చేసి మళ్లీ వాటిని వేరే వారిపై నెట్టడం అనే మీ కపట నాటకాలకు కాలం చెల్లింది. ప్రజల రక్షణకు కట్టుబడి ఉన్నాం. ఏ ఘటననూ ఉపేక్షించం.. ఏ నిందితుడినీ వదిలేది లేదు. బెంగళూరు ప్యాలెస్‌లో కూర్చుని ఇక్కడ కుట్రలు అమలు చేయాలంటే కుదరదు. మీ హెచ్చరికలకు భయపడే ప్రభుత్వం కాదు. ప్రజలకు జవాబుదారీగా ఉండే ప్రజా ప్రభుత్వమిది అని లోకేశ్‌ అన్నారు.

Read Also: Beauty Tips: కీరదోసకాయతో మెరిసే చర్మం సొంతం చేసుకోండిలా!

 

 

Follow us