Congress: కాంగ్రెస్ పార్టీకి నిధుల కొర‌త కాదు.. అభ్య‌ర్ధుల కొర‌తః బీజేపీ

Loksabha Elections: కాంగ్రెస్ పార్టీ(Congress party)ని నిధుల కొర‌త వెంటాడ‌టం లేద‌ని, ఆ పార్టీకి అభ్య‌ర్ధుల కొర‌త ఉంద‌ని బీజేపీ(bjp) జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి షెహ‌జాద్ పూనావాలా(Shehzad Poonawalla) ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఐటీ నోటీసుల( IT notices) జారీపై ఆ పార్టీ నేత‌లు గ‌గ్గోలు పెడుతున్నార‌ని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తాను రాజ్యాంగానికి, దేశ చ‌ట్టాల‌కు అతీత‌మ‌ని భావిస్తోంద‌ని ఆరోపించారు. We’re now on WhatsApp. Click to Join. ప‌న్ను ఎగ‌వేసి అస‌త్యాలు […]

Published By: HashtagU Telugu Desk
Bjp

It is not lack of funds for the Congress party, it is the lack of candidates, BJP

Loksabha Elections: కాంగ్రెస్ పార్టీ(Congress party)ని నిధుల కొర‌త వెంటాడ‌టం లేద‌ని, ఆ పార్టీకి అభ్య‌ర్ధుల కొర‌త ఉంద‌ని బీజేపీ(bjp) జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి షెహ‌జాద్ పూనావాలా(Shehzad Poonawalla) ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఐటీ నోటీసుల( IT notices) జారీపై ఆ పార్టీ నేత‌లు గ‌గ్గోలు పెడుతున్నార‌ని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తాను రాజ్యాంగానికి, దేశ చ‌ట్టాల‌కు అతీత‌మ‌ని భావిస్తోంద‌ని ఆరోపించారు.

We’re now on WhatsApp. Click to Join.

ప‌న్ను ఎగ‌వేసి అస‌త్యాలు చెబుతూ బాధితుల‌మ‌ని సానుభూతి సంపాదించ‌వ‌చ్చ‌నేది కాంగ్రెస్ ఆలోచ‌న‌ని పూనావాలా అన్నారు. సామాన్య ప్ర‌జ‌లు ప‌న్నులు క‌డుతుంటే కాంగ్రెస్ మాత్రం వీవీఐపీ క్యాట‌గిరీగా భావిస్తోంద‌ని దుయ్య‌బ‌ట్టారు. వారి దోపిడీ ప‌ట్టుబ‌డ‌గానే ప‌న్ను చెల్లించేందుకు వెనుకాడుతున్నార‌ని అన్నారు.

Read Also: Pawan Kalyan : పవన్ తొలి విడత ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఖరారు..

2021లో నోటీసులు వ‌చ్చినా దాన్ని స‌వాల్ చేయ‌డంలో కాంగ్రెస్ జాప్యం చేసింద‌ని, ఆపై స‌వాల్ చేసిన త‌ర్వాత వారికి ఉప‌శ‌మ‌నం ల‌భించ‌లేద‌ని తెలిపారు. ప్ర‌ధాని మోదీ, బీజేపీని గుడ్డిగా వ్య‌తిరేకించే కాంగ్రెస్ నేత‌లు ఇప్పుడు దేశ వ్య‌వ‌స్ధ‌ల‌పైనా దాడికి తెగ‌బ‌డ్డార‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఇది కాంగ్రెస్ అస‌హ‌నాన్ని వెల్ల‌డిస్తోంద‌ని అన్నారు. కాంగ్రెస్ ఎంపీ ధీర‌జ్ సాహు నివాసంలో రూ. 350 కోట్లు ప‌ట్టుబ‌డ్డాయ‌ని, వారి ఎంపీల వ‌ద్ద చాలా డ‌బ్బు ఉంద‌ని, ఇది నిధుల స‌మ‌స్య కాద‌ని ఆ పార్టీకి అభ్య‌ర్ధుల కొర‌త ఉంద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు.

  Last Updated: 29 Mar 2024, 06:27 PM IST