Site icon HashtagU Telugu

imran bail :ఇమ్రాన్ కు బెయిల్ మంజూరు

Imran Khan

New Web Story Copy (87)

అల్ ఖాదిర్ ట్రస్టు కేసులో అరెస్టయిన పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కు ఎట్టకేలకు శుక్రవారం బెయిల్ (imran bail )మంజూరైంది. ఆయన అరెస్టు చట్ట వ్యతిరేకం అని ఆ దేశ సుప్రీం కోర్టు వ్యాఖ్యానించిన మరుసటి రోజే .. బెయిల్ మంజూరు కావడం గమనార్హం. రెండు వారాలపాటు ఇమ్రాన్ కు మధ్యంతర  బెయిల్ (imran bail)ను మంజూరు చేస్తూ ఇస్లామాబాద్ హైకోర్టు లోని ఒక డివిజన్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. అయితే భద్రతా కారణాల రీత్యా ఇమ్రాన్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలు ఆలస్యంగా విచారణ ప్రారంభమైంది. ఇమ్రాన్ కు బెయిల్ మంజూరు కావడంపై ఆయన పార్టీ పీటీఐ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

ఇమ్రాన్‌ఖాన్‌ను జైలులోనే హతమార్చేందుకు కుట్ర : లాయర్లు 

ఇక బెయిల్ మంజూరు కాకముందు .. నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో (NAB) కస్టడీలో ఉన్న ఇమ్రాన్‌ఖాన్‌ను జైలులోనే హతమార్చేందుకు కుట్ర పన్నారని ఆరోపిస్తూ పీటీఐ పార్టీ శ్రేణులు దేశ వ్యాప్తంగా నిరసన తెలిపాయి. ఈనేపథ్యంలో ఇమ్రాన్ ను కలిసొచ్చిన తర్వాత ఆయన లాయర్లు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి సంచలన ఆరోపణలు చేశారు. నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో కస్టడీలో ఉన్న ఇమ్రాన్ ను చిత్రహింసలకు గురిచేశారని, గుండెపోటు వచ్చేలా భోజనంలో ఇన్సులిన్‌ను కలిపి ఉంచారని మీడియా కు తెలిపారు. తనకు నెమ్మదిగా గుండెపోటు వచ్చేలా ఇంజెక్షన్ ఇచ్చారని, వాష్‌రూమ్‌ను ఉపయోగించేందుకూ అనుమతించలేదని ఇమ్రాన్ తమతో చెప్పారని వెల్లడించారు. “ఇది ఇమ్రాన్ ను చంపే ప్రయత్నం. తనకు కనీసం నిద్రపోవడానికి కూడా అనుమతి ఇవ్వడం లేదని ఇమ్రాన్ మాతో చెప్పారు . మరుగుదొడ్డి, మంచం లేని మురికి గదిలో తనను ఉంచారని ఇమ్రాన్ వాపోయారు ” అని ఇమ్రాన్ తరఫు లాయర్లు వివరించారు.