Leopard Jeedimetla : అది చిరుతపులా ? అడవి కుక్కా ? తేలిపోయింది

ఇదంతా నిజం కాదు .. వట్టి పుకార్లు.. ఇది నిజం అనుకొని మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని అపురూప కాలనీ వాసులు వణికిపోయారు. వాట్సాప్ గ్రూపుల్లో వీడియో ఫుటేజీ తో పాటు షేర్ అయిన మెసేజ్ లను చూసి కలవరానికి లోనయ్యారు. అపురూప కాలనీవాసుల వాట్సాప్ గ్రూపుల్లో చిరుత(Leopard Jeedimetla) సంచరిస్తున్న వీడియో ఒకటి వైరల్‌గా మారింది.

Published By: HashtagU Telugu Desk
Leopard Jeedimetla

Leopard Jeedimetla

“అర్ధరాత్రి ఒంటిగంట సమయం అది.
ఆ కాలనీలో అందరూ గాఢ నిద్రలో ఉన్నారు.
సరిగ్గా ఈ టైంలో చిరుత పులి ఎంటర్ అయింది.
కాలనీలో కులాసాగా అటూ ఇటూ తిరిగింది..”

ఇదంతా నిజం కాదు .. వట్టి పుకార్లు.. ఇది నిజం అనుకొని మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని అపురూప కాలనీ వాసులు వణికిపోయారు. వాట్సాప్ గ్రూపుల్లో వీడియో ఫుటేజీ తో పాటు షేర్ అయిన మెసేజ్ లను చూసి కలవరానికి లోనయ్యారు. అపురూప కాలనీవాసుల వాట్సాప్ గ్రూపుల్లో చిరుత(Leopard Jeedimetla) సంచరిస్తున్న వీడియో ఒకటి వైరల్‌గా మారింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. రాత్రిపూట ఇంటి బయటకు వెళ్లేందుకూ వణికిపోయారు.

also read : Tiger Died: విద్యుత్ కంచె తగిలి పులి మృతి.. వండుకుని తినేసిన వైనం!

ఈనేపథ్యంలో ఫారెస్ట్ ఆఫీసర్లు కాలనీని సందర్శించారు. సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన దృశ్యాలను చెక్ చేశారు. వీడియోలో ఉన్నది చిరుతపులి(Leopard Jeedimetla) కాదని.. అడవి కుక్క అని తేల్చారు. అయితే కాలనీ వాసులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ వీడియోను ఎవరు పోస్ట్‌ చేశారు ? మార్ఫింగ్ చేసి ప్రజలను భయానికి గురి చేస్తున్నది ఎవరు ? అనే కోణంలోనూ ఆరా తీస్తున్నారు. ఇలాంటి ఫేక్ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్‌ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.

  Last Updated: 16 May 2023, 01:19 PM IST