Rakhi Festival-2 Days : రాఖీ పండుగ ఎప్పుడు ?
ఈసారి ఫెస్టివల్ ను ఆగస్టు 30న జరుపుకోవాలా ? ఆగస్టు 31న జరుపుకోవాలా ?
రాఖీ పండగ రోజున భద్ర నీడ ఉండడంతో.. పండుగ తేదీపై ప్రజల్లో గందరగోళం నెలకొంది.
దీనిపై పండితులు చెబుతున్న విశ్లేషణ ఏమిటో ఒకసారి చూద్దాం..
హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం రాఖీ పండుగను ఆగస్టు 30న జరుపుకోనున్నారు. అయితే షరతులు వర్తిస్తాయి. ఈ ఏడాది రాఖీ పండుగ రోజు భద్ర నీడ ఉందనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. భద్ర కాల సమయంలో రాఖీ కట్టడం మంచిది కాదు. ఆగస్టు 30న ఉదయం 10.59 గంటల నుంచి రాత్రి 9.02 గంటల వరకు భద్ర కాలం ఉంది. ఈ సమయంలో రాఖీ పండుగను జరుపుకోవడం మంచిది కాదని పండితులు అంటున్నారు. భద్ర కాల సమయం ముగిసిన తర్వాతే రాఖీ కట్టడం బెటర్. ఒకవేళ ఆగస్టు 30న రాఖీ కట్టాలని అనుకుంటే రాత్రి 9.15 గంటల తర్వాత శుభ ముహూర్తం మొదలవుతుంది. ఆగస్టు 31న ఉదయం 7.5 నిమిషాల వరకు మాత్రమే రాఖీ కట్టే శుభ సమయం ఉంటుంది. ఈ వ్యవధిలో పండుగ జరుపుకోవచ్చు. అందుకే ఈ ఏడాది రాఖీ పండుగను ఆగస్టు 30, 31 తేదీల్లో(Rakhi Festival-2 Days) జరుపుకోనున్నారు. అయితే భద్ర కాల సమయం ముగిసిన తర్వాత మాత్రమే రాఖీ కట్టడం మంచిది.
Also read : Weekly Horoscope : ఈవారం రాశి ఫలితాలు.. ఆగస్టు 6 నుంచి 12 వరకు వార ఫలాలు
రక్షా బంధన్ పూజా విధానం
- దేవుడిని పూజించిన తర్వాత రాఖీ కట్టడానికి సంబంధించిన వస్తువులను సేకరించండి.
- వెండి, ఇత్తడి, రాగి లేదా ఉక్కుతో తయారుచేసిన ఏదైనా శుభ్రమైన ప్లేట్ తీసుకొని దానిపై అందమైన గుడ్డను వేయండి.
- ఆ ప్లేట్‌లో కలశం, కొబ్బరికాయ, సుపారీ, కలవా, రోలి, చందనం, అక్షతం, పెరుగు, రాఖీ, స్వీట్‌లను ఉంచండి. నెయ్యి దీపం కూడా ఉంచండి.
- ముందుగా ఈ పళ్ళెంను ఇంట్లో లేదా గుడిలో దేవునికి సమర్పించండి.
- శ్రీకృష్ణుడికి ఒక రాఖీని, గణేశుడికి మరో రాఖీని సమర్పించండి.
- దేవుడికి రాఖీ కట్టి.. పైన పేర్కొన్న శుభ ముహూర్తాన్ని చూసిన తర్వాత మీ సోదరుడిని తూర్పు లేదా ఉత్తరం వైపు కూర్చోబెట్టండి.
- సోదరుడికి మొదట తిలకం పూయండి.. ఆపై రక్షా సూత్రాన్ని కట్టి, అతనికి హారతి ఇవ్వండి. దీని తర్వాత మీ సోదరుడి నోటిని స్వీట్లతో తీపి చేయండి.
- రాఖీ కట్టేటప్పుడు సోదరులు, సోదరీమణుల తలపై ఏదో ఒక గుడ్డ కప్పబడి ఉండాలని గుర్తుంచుకోండి.
- రక్షా సూత్రాన్ని కట్టిన తర్వాత తల్లిదండ్రులు, ఇంటి పెద్దల ఆశీర్వాదం తీసుకోండి.
Also read : Samantha : మయోసైటిస్ ట్రీట్మెంట్‌కు 25 కోట్ల ఖర్చు.. కౌంటర్ ఇచ్చిన సమంత..
ఈ విషయాలను జాగ్రత్తగా చూసుకోండి..
1. రాఖీ కట్టేటప్పుడు సోదరుడు లేదా సోదరి దక్షిణం వైపు చూడకూడదని గుర్తుంచుకోండి. దక్షిణ దిశను యమ దిక్కుగా పరిగణిస్తారు. ఈ దిశలో పనిచేయడం వల్ల జీవితకాలం తగ్గుతుంది.
2. రాఖీ రోజున సోదరుడికి తిలకం పెట్టడానికి చందనం లేదా కుంకుమను వాడొచ్చు.
3. అక్షత ధాన్యాలు.. విరిగిపోనివే వాడాలి.
4. సోదరునికి హారతి ఇచ్చే పళ్ళెంలోని దీపం విరిగినదై ఉండకూడదు.
5. సోదరునికి హారతి ఇచ్చేటప్పుడు నెయ్యి దీపాన్ని ఉపయోగించండి.