Site icon HashtagU Telugu

China War: తైవాన్‌ – చైనా మధ్య యుద్ధ మేఘాలు.. ఎందుకు ? ఏమిటి?

Taiwan Imresizer

Taiwan Imresizer

తైవాన్‌ – చైనా మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడింది. తైవాన్‌ జలసంధిపై క్షిపణులతో చైనా విరుచుకుపడింది. దీంతో కలకలం రేగింది. ఈ పరిణామాల వెనక చైనా పునరేకీకరణ అంశం అంతర్లీనంగా ఉంది. తమ దేశంతో తైవాన్ పునరేకీకరణ తప్పకుండా జరగాలని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ స్పష్టం చేశారు. ఇందుకోసం బలప్రయోగాన్ని ఆయన తోసిపుచ్చలేదు. ఈనేపథ్యంలో యావత్ ప్రపంచ ప్రజలు ఈ రెండు దాయాది దేశాల మధ్యనున్న వైరం గురించి తెలుసుకోవడంపై దృష్టిపెట్టారు.

చైనా.. తైవాన్.. చెరో వాదన

ఆగ్నేయ చైనా తీరానికి దాదాపు 100 మైళ్ల దూరంలో ఉన్న తైవాన్ ద్వీపం తమ దేశంలో భాగమని చైనా అంటోంది. ఇది ఎప్పటికైనా తిరిగి దేశంలో విలీనం కావాల్సిందేనని వాదిస్తోంది. తైవాన్ మాత్రం తనను తాను స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది. ఇది అమెరికా కు అనుకూలమైన విదేశాంగ విధానంతో మసులుకుంటోంది.

ఇలా విడిపోయాయి..

రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత కొన్ని ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి.చైనా ప్రధాన భూభాగంలో జాతీయవాద ప్రభుత్వ దళాలు, చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ మధ్య పోరాటం జరిగింది. 1949లో కమ్యూనిస్టులు గెలిచారు. వారి నాయకుడు మావో జెడాంగ్ బీజింగ్‌ పై పట్టు సాధించారు. ఇక జాతీయవాద పార్టీ కోమింటాంగ్ నేతలు చైనా నుంచి తైవాన్‌కు పారిపోయారు.
చాలామంది తైవాన్‌ ప్రజలు తమను తాము తైవానీస్ పిలిపించుకోవడానికి ఇష్టపడతారని తాజా అధ్యయనంలో వెల్లడైంది.

చైనాకు లాభం ఏమిటి?

తైవాన్‌ను చైనా స్వాధీనం చేసుకుంటే ఎక్కువ నష్టం జరిగేది అమెరికాకే. అందుకే అమెరికా దీనిపై రాద్ధాంతం చేస్తోంది. తైవాన్ పై చైనా దూకుడును అంతర్జాతీయ వేదికలపై ఎండగట్టే ప్రయత్నం చేస్తోంది. అమెరికాకు ఇంతగా భయం కలిగిస్తున్న అంశం ఏమిటీ ? అనుకుంటున్నారా!! తైవాన్ ఒకవేళ చైనా చేతికి చిక్కితే.. పశ్చిమ పసిఫిక్ ప్రాంతంలో దాని ఆధిపత్యం పెరుగుతుంది. అమెరికాలోని గువామ్, హవాయి దీవుల్లో ఉన్న రక్షణ స్థావరాలను చైనా టార్గెట్ చేసేందుకు మార్గం సుగమం అవుతుంది.

Exit mobile version